గుండె పనితీరును ఇలా మెరుగుపర్చుకోండి.. పరిశోధనలో ఆసక్తికర విషయాలు వెల్లడి..

మనం ఏ పని చేయాలన్నా.. ఆరోగ్యంగా ఉంటేనే చేయగలం. శరీరంలో ప్రతీ అవయం ఆరోగ్యంగా ఉండాలంటే వ్యాయామం చేయడం, తినే ఆహారంలో కొన్ని మార్పులు చేసుకుంటే ఆరోగ్యంగా ఉంటారు. దీనిలో ముఖ్యంగా గుండె పని తీరును మెరుగ్గా ఉంచుకోవాలి. గుండెను ఆరోగ్యంగా ఉంచడానికి, వ్యాయామంతో పాటు ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. గుండెను ఆరోగ్యంగా ఉంచడానికి పరిమిత మొత్తంలో చాక్లెట్, జున్ను, పెరుగు తినాలని ఇటీవలు పరిశోధనలో తేలిందని.. శాస్త్రవేత్తలు వెల్లడించారు.

ఇటలీలోని నేపుల్స్ విశ్వవిద్యాలయానికి చెందిన పరిశోధకులు తమ పరిశోధనలో ఈ విషయాన్ని కనుగొన్నారు. ప్రతీ రోజు కనీసంలో కనీసం 200 గ్రాముల పాల ఉత్పత్తులను తీసుకోవాలని పరిశోధకులు చెబుతున్నారు. ఒకవేళ జున్ను తినాలనుకుంటే.. అందులో 50 గ్రాములు తింటే.. గుండె ఆరోగ్యంగా ఉంటుందట. అంతేకాకుండా చాక్లెట్ ను కొంత మొత్తంలో తీసుకుంటే.. అది గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుందట. ఇలా డార్క్ చాక్లెట్‌లో ఉండే ఫ్లేవనోల్స్, యాంటీఆక్సిడెంట్లు గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయి.

మనం తినే ఆహారంలో ఆకుకూరల పరిమాణాన్ని కొంత పెంచాలి. అది గుండె పనిచేసే విధానాన్ని మెరుగు పరుస్తుందని అంటున్నారు. ఇలా చేస్తే 16 శాతం వరకు గుండె జబ్బులను రానివ్వదట. అదే సమయంలో, తృణధాన్యాలలో ఫైబర్ కనిపిస్తుంది, ఇది చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది. రోజూ 150 గ్రాముల తృణధాన్యాలు తీసుకుంటే, ప్రమాదం 22%తగ్గుతుంది.

వ్యాయామంలో ముఖ్యంగా.. రెసిస్టెన్స్ బ్యాండ్‌లు లేదా పుషప్స్, చినుప్స్ వంటి శరీర బరువు వ్యాయామాలు చేస్తే గుండె జబ్బులను తగ్గించొచ్చు. ఈ వ్యాయామాల వల్ల కొలెస్టరాల్ ను కూడా నియంత్రించవచ్చు. ఏరోబిక్ వ్యాయామం గుండె పంపింగ్ సామర్థ్యాన్ని రోజూ 30 నిమిషాలు, వారానికి ఐదు రోజులు మెరుగుపరుస్తుందని నిపుణులు చెబుతున్నారు.