టాలీ వుడ్ ఇండస్ట్రీలో బాహుబలి తర్వాత ప్రభాస్ ఎంతో గుర్తింపును సంపాదించుకున్నారు.ప్రపంచ స్థాయి గుర్తింపు సంపాదించిన బాహుబలి తర్వాత ప్రభాస్ చేసే ప్రతి సినిమా కూడా పాన్ ఇండియా స్థాయిలోనే తెరకెక్కడంతో ప్రభాస్ హీరోగా గుర్తింపు సంపాదించుకున్నారు. ప్రస్తుతం వరుస పాన్ ఇండియా చిత్రాలతో బిజీగా గడుపుతున్న ప్రభాస్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొని కొన్ని ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.
ముఖ్యంగా బాహుబలి సినిమా షూటింగ్ కోసం ఎంతో కష్టపడినట్లు తెలిపారు.బాహుబలి సినిమా కోసం కాస్త శరీర బరువు పెరగాల్సి రావడంతో ప్రతి రోజు 40 కి పైగా గుడ్లు తినేవాడినని ఈ సందర్భంగా ప్రభాస్ తెలిపారు.ఎప్పుడైనా డైటింగ్ నుంచి బ్రేక్ దొరికితే నాకెంతో ఇష్టమైన ఇష్టమైన బిర్యానీలను ఫుల్లుగా లాగించే వాడిని ఒక రోజుకు 15 రకాల బిర్యానీలు తెప్పించుకొని తినేవాడిని అని తెలిపారు.
ఈ సినిమా కోసం బరువు పెరగడంతో పాటు కండరాలు కూడా పంచుకోవాల్సి వచ్చింది. అయితే జిమ్ కి తరచూ వెళ్లడం కుదరకపోవడంతో ఏకంగా కోటిన్నర రూపాయల ఖర్చు చేసి ఇంట్లోనే జిమ్ ఏర్పాటు చేసుకున్నానని, వీలైనప్పుడల్లా వ్యాయామం చేసే వాడిని అని తెలిపారు. బాహుబలి సినిమా షూటింగ్ పూర్తి అయిన తర్వాత కొంతకాలం వరకు గుడ్డు జోలికి వెళ్లలేదని, ఈ సినిమా విడుదలై మంచి గుర్తింపు సంపాదించుకోవడం తో నేను పడిన కష్టానికి ప్రతిఫలం దొరికిందని ఎంతో సంతోషించానని ఈ సందర్భంగా ప్రభాస్ తెలిపారు.
ఇక ప్రస్తుతం ప్రభాస్ రాధేశ్యామ్, సలార్, ఆది పురుష్, వంటి సినిమాలు చేస్తున్నారు. ప్రస్తుతం కరుణ అధికమవడంతో ఈ సినిమా షూటింగ్ లన్ని వాయిదా పడి ఇంటికే పరిమితమయ్యారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…