టాలీ వుడ్ ఇండస్ట్రీలో బాహుబలి తర్వాత ప్రభాస్ ఎంతో గుర్తింపును సంపాదించుకున్నారు.ప్రపంచ స్థాయి గుర్తింపు సంపాదించిన బాహుబలి తర్వాత ప్రభాస్ చేసే ప్రతి సినిమా కూడా పాన్ ఇండియా స్థాయిలోనే తెరకెక్కడంతో ప్రభాస్ హీరోగా గుర్తింపు సంపాదించుకున్నారు. ప్రస్తుతం వరుస పాన్ ఇండియా చిత్రాలతో బిజీగా గడుపుతున్న ప్రభాస్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొని కొన్ని ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.

ముఖ్యంగా బాహుబలి సినిమా షూటింగ్ కోసం ఎంతో కష్టపడినట్లు తెలిపారు.బాహుబలి సినిమా కోసం కాస్త శరీర బరువు పెరగాల్సి రావడంతో ప్రతి రోజు 40 కి పైగా గుడ్లు తినేవాడినని ఈ సందర్భంగా ప్రభాస్ తెలిపారు.ఎప్పుడైనా డైటింగ్‌ నుంచి బ్రేక్‌ దొరికితే నాకెంతో ఇష్టమైన ఇష్టమైన బిర్యానీలను ఫుల్లుగా లాగించే వాడిని ఒక రోజుకు 15 రకాల బిర్యానీలు తెప్పించుకొని తినేవాడిని అని తెలిపారు.

ఈ సినిమా కోసం బరువు పెరగడంతో పాటు కండరాలు కూడా పంచుకోవాల్సి వచ్చింది. అయితే జిమ్ కి తరచూ వెళ్లడం కుదరకపోవడంతో ఏకంగా కోటిన్నర రూపాయల ఖర్చు చేసి ఇంట్లోనే జిమ్ ఏర్పాటు చేసుకున్నానని, వీలైనప్పుడల్లా వ్యాయామం చేసే వాడిని అని తెలిపారు. బాహుబలి సినిమా షూటింగ్ పూర్తి అయిన తర్వాత కొంతకాలం వరకు గుడ్డు జోలికి వెళ్లలేదని, ఈ సినిమా విడుదలై మంచి గుర్తింపు సంపాదించుకోవడం తో నేను పడిన కష్టానికి ప్రతిఫలం దొరికిందని ఎంతో సంతోషించానని ఈ సందర్భంగా ప్రభాస్ తెలిపారు.

ఇక ప్రస్తుతం ప్రభాస్ రాధేశ్యామ్, సలార్, ఆది పురుష్, వంటి సినిమాలు చేస్తున్నారు. ప్రస్తుతం కరుణ అధికమవడంతో ఈ సినిమా షూటింగ్ లన్ని వాయిదా పడి ఇంటికే పరిమితమయ్యారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here