టాలీవుడ్ ఇండస్ట్రీలో రౌడీ హీరోగా ఎంతో పేరు సంపాదించుకున్న విజయ్ దేవరకొండ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సోషల్ మీడియాలో కూడా ఈ హీరోకి ఫ్యాన్ ఫాలోయింగ్ ఓ రేంజిలో ఉంటుంది. విజయ్ సినిమా వస్తుందంటే చాలు ఆ సినిమాపై ప్రేక్షకులు ఎంతగానో అంచనాలు పెంచుకుంటారు. అయితే ఈ విధంగా స్టార్ డమ్ సంపాదించుకున్న విజయ్ దేవరకొండకు ఈ గుర్తింపు మొత్తం ఒక రోజులో సంపాదించుకున్నది కాదని, ఆ విజయం వెనుక ఎంతో కష్టం ఉందని తెలిపారు. నేడు విజయ్ పుట్టినరోజు కావడంతో ఈ సందర్భంగా తన కెరీర్ లో పడిన కష్టాలను గురించి ముచ్చటించారు.

విజయ్ తండ్రి గోవర్ధన్‌రావుకి నటన అంటే ఆసక్తి. ఆ కోరికతోనే సొంతూరు వదిలి హైదరాబాద్ వచ్చారు. ఎన్నో సినిమా అవకాశాల కోసం ఎదురు చూసిన అవకాశాలు రాకపోవడంతో టీవీ డైరెక్టర్ గా మారిపోయారు.ఈ క్రమంలోనే విజయ్ కి నటనపై ఆసక్తి ఉండడం గమనించిన అతను అతని యాక్టింగ్ స్కూల్లో చేర్పించారు. తర్వాత శేఖర్ కమ్ముల దర్శకత్వం వహిస్తున్న లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ సినిమా ఆడిషన్స్ జరుగుతున్నాయని తెలుసుకొని ఆడిషన్స్ లో ఓ పాత్రకు ఎంపికయ్యారు.

లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ సినిమా కంటే ముందుగా రవిబాబు దర్శకత్వం వహించిన నువ్విలా అనే సినిమాలో ఓ చిన్న పాత్ర పోషించారు. ఆ తర్వాత ఎవడే సుబ్రహ్మణ్యం సినిమాలో సహ నటుడిగా మంచి గుర్తింపు సంపాదించుకున్న విజయ్ పెళ్లిచూపులు ద్వారా హీరోగా పరిచయం అయ్యాడు. ఆ తర్వాత “అర్జున్ రెడ్డి” సినిమా ద్వారా ఎంతోమంది దృష్టిని ఆకర్షించాడు.

అర్జున్ రెడ్డి సినిమా ద్వారా ఎంతో మంది ప్రేక్షకులను సంపాదించుకున్న విజయ్ దేవరకొండ తర్వాత వెనుతిరిగి చూసుకోలేదు.తను నటించిన సినిమాలన్నీ మంచి విజయం సాధించడంతో తన సినిమాలు హిందీలో కూడా డబ్ కావడంతో ఇతనికి ఫ్యాన్ ఫాలోయింగ్ బాగా పెరిగింది. అయితే ప్రస్తుతం ఉన్న ఈ స్టార్ డమ్ మాత్రం అందరికీ తెలిసిందే. కానీ తెరవెనుక మొదటి ఐదు చిత్రాలలో ఎంత కష్టపడ్డానో ఎవరికీ తెలియదని ఈ సందర్భంగా విజయ్ తెలిపారు.

మొదటగా కొత్తవాళ్లతో సినిమాలు చేయడానికి ఎవరు నిర్మాతలు ముందుకు రాలేదు. నాలాగే ఎంతో మంది నిరాశ చెందకూడదని ఎంతో కష్టమైన పని అయినప్పటికీ నిర్మాణ రంగంలో దిగి పలు చిత్రాలకు నిర్మాతగా మారాడు. అదే విధంగా రౌడీ అనే దుస్తుల వ్యాపారంలో దిగి తనదైన గుర్తింపును సంపాదించుకున్నారు.ఇక ప్రస్తుతం విజయ్ దేవరకొండ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో లైగర్ అనే పాన్ ఇండియా చిత్రంలో నటిస్తున్న సంగతి మనకు తెలిసిందే.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here