ప్రస్తుతం దేశవ్యాప్తంగా నెలకొన్న పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని అధికారులు ఎటువంటి శుభకార్యాలు అయినా కేవలం కొంత మంది సమక్షంలో మాత్రమే జరగాలని ఆంక్షలు విధించారు. అయితే ఈ శుభకార్యాలు జరిగేటప్పుడు తప్పనిసరిగా అధికారుల అనుమతి తీసుకోవాల్సి ఉందని, లేనిపక్షంలో వారిపై కేసులు నమోదు చేసే అవకాశం ఉంటుందని అధికారులు చెబుతున్నారు.కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలోనే ఈ విధమైనటువంటి ఆంక్షలు విధించినట్లు మనందరికీ తెలిసిన విషయమే.

ఈక్రమంలోనే ఒడిషాలోని చెలిగడ గ్రామంలో ఓ వివాహ వేడుక జరిగింది. ఈ వివాహానికి అధికారుల నుంచి ఎటువంటి అనుమతి తీసుకోకపోగా, పెద్ద ఎత్తున బంధువులను వివాహానికి ఆహ్వానించి ఎంతో ఘనంగా పెళ్లి నిర్వహించారు. వివాహం అనంతరం ఊరేగింపు కార్యక్రమంలో పెద్ద ఎత్తున బంధువులు, స్థానికులు పాల్గొన్నారు. సమాచారం అందుకున్న ఎమ్మార్వో శృతిరంజన్ పోలీసులతో కలిసి అక్కడకు చేరుకున్నారు.

కరోనా సమయంలో ఇంత మంది గుమిగూడవద్దని తెలియదా? పెళ్లిళ్లపై ఆంక్షలు ఉన్నాయని తెలియదా? అని ప్రశ్నించారు. అనంతరం వారి ఊరేగింపును అడ్డుకునే ప్రయత్నం చేయగా, పెళ్లి బృందం రెచ్చిపోయి అధికారులపై దాడికి దిగారు. ఈ క్రమంలోనే ఎమ్మార్వో ఎస్ఐలతో పాటు మరో నలుగురికి గాయాలు కావడంతో వెంటనే వారిని చికిత్స నిమిత్తం ఆర్‌.ఉదయగిరి కమ్యూనిటీ హెల్త్‌ సెంటర్‌కి తరలించారు.

విషయం తెలుసుకున్న సబ్‌డివిజన్‌ పోలీస్‌ అధికారి దిలీప్‌కుమార్‌ గ్రామానికి చేరుకొని స్థానికులను ప్రశ్నించారు. నిందితులను పట్టుకునేందుకు ప్రయత్నించగా వారి పారిపోవడంతో పలువురిపై కేసులు నమోదు చేసి విచారించారు. ఈ విషయంపై కలెక్టర్ ఆరా తీసింది నిందితులకు తప్పకుండా శిక్ష పడేలా, నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here