Movie News

Ekanath & Harika : ప్రొపోజ్ చేయకముందే కిస్ చేసాడు..పెళ్ళైన నెలకే ప్రెగ్నెంట్ అయ్యా.. కానీ అలా అయ్యే సరికి.. ఇద్దరిలో రొమాంటిక్ ఎవరంటే : ఏకనాథ్ & హారిక

Ekanath & Harika : ఈటీవీ ప్లస్ లో వచ్చిన నేను శైలజ సీరియల్ ద్వారా మంచి పేరు తెచ్చుకున్నరు ఏకనాథ్, హారిక. ఏక్ నాథ్ ది విజయవాడ కాగా హారికది కాకినాడ. నేను శైలజ సీరియల్ తరువాత ఇద్దరూ పెళ్లి కూడా చేసేసుకున్నారు. ఇద్దరికీ ఆ సీరీయల్ సమయంలోనే పరిచయం ఏర్పడింది, ఇక ఆ పరిచయం ప్రేమగా మారి పెళ్లి చేసుకున్నారు. పెళ్ళికి ముందు వాళ్ళ ఇంట్లో పెద్దలు ఒప్పుకోక పోవడం జరిగినా ఒప్పించి పెళ్లి చేసుకున్న ఈ జంట ఇక యూట్యూబ్ ఛానెల్ ద్వారా కూడా బాగా పాపులర్ అయ్యారు. వాళ్ళ డైలీ లైఫ్ అలాగే ట్రిప్స్ కి సంబంధిచిన వ్లాగ్స్ చేస్తూ ఫాలోయర్స్ ని పెంచుకుంటూ పోతున్నారు.

మొదట ప్రొపోజ్ చేసింది…

ఇక సీరియల్ లో హీరో హీరోయిన్లుగా నటిస్తున్న సమయంలో ఏక్ నాథ్, హారిక ను ఇష్టపడి లవ్ ప్రపోజ్ చేయాలని అనుకున్నాడు. ఇక ఒకసారి ఇద్దరూ సీరియల్ ఎపిసోడ్ ను ఫోన్ లో చూస్తున్నపుడు హారిక చేయిపై ముద్దు పెట్టి ఐ లవ్ యూ అంటూ చెప్పేసాడట. ఇక తాను ఒకవేళ కోపంగా ప్రవర్తిస్తే తనకు నాపై ఇష్టం లేనట్టు సైలెంట్ గా ఉంటే ఓకే అన్నట్లు అని అనుకున్నాడట ఏక్ నాథ్. ఇక హారిక అలా కిస్ చేయగానే షాక్ అయిపోయి ఏం చేయాలో అర్థం కాలేదు అంటూ సైలెంట్ గా ఉండిపోయానని రీసెంట్ గా యూట్యూబ్ లో ఒక ఛానెల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూ లో తెలిపారు.

ఆ సంఘటన తరువాత కొన్నిరోజులు ఇద్దరూ ఆ టాపిక్ గురించి మాట్లాడుకోలేదంటూ చెప్తూ చివరికి హారిక ఏక్ నాథ్ పుట్టినరోజు నాడు రింగ్ ఇచ్చి తన లవ్ ని కూడా తెలిపిందట. అలా ప్రేమించుకున్నాక, పెద్దలను ఒప్పించి గత ఏడాది డిసెంబర్ లో పెళ్లి చేసుకున్నారు. ఇక పెళ్ళైన నెలకే ప్రెగ్నెంట్ అవడంతో మొదట భయపడినా ఆ తరువాత ఓకే అనుకున్నాం అయితే గర్భం ట్యూబ్ లో ఉండటం వల్ల తీసేయాలని లేకపోతే ప్రమాదం అని డాక్టర్ చెప్పడంతో గర్భ స్రావం చేయించుకోవాల్సి వచ్చిందని ఇద్దరూ ఎమోషనల్ అయ్యారు. ఇక ఇద్దరిలో హారిక రొమాంటిక్ అంటూ చెప్పి అలాగే హారిక కు కోపం ఎక్కువ అంటూ ఏక్ నాథ్ చెప్పారు. అలా వారి ప్రేమ ముచ్చట్లను అభిమానులతో పంచుకున్నారు.

Bhargavi

Recent Posts

రాజా రవీంద్ర ఫ్యామిలీ ఫోటోలు వైరల్.. మనవళ్లు చూస్తే మురిసిపోతారు

తెలుగు సినీ పరిశ్రమలో ఎన్నో విభిన్న పాత్రలతో ప్రేక్షకులను అలరించిన నటుడు Raja Ravindra మరోసారి వార్తల్లో నిలిచారు. ఈసారి…

30 minutes ago

గ్యాస్ రాలేదు.. కానీ డెలివరీ మెసేజ్ వచ్చింది! వినియోగదారుడికి షాక్

వంట గ్యాస్ సరఫరా సమస్యలు మరోసారి వెలుగులోకి వచ్చాయి. గ్యాస్ సిలిండర్ బుక్ చేసినప్పటికీ సమయానికి అందక వినియోగదారులు ఇబ్బందులు…

33 minutes ago

‘పాపం ప్రతాప్‌’ రివ్యూ.. కొత్త కథ, కానీ కుదరని ప్రయత్నం

తెలుగు సినీ ప్రేక్షకుల ముందుకు వచ్చిన తాజా వినోదాత్మక చిత్రం ‘పాపం ప్రతాప్‌’ విభిన్నమైన కథతో ఆకట్టుకోవాలని ప్రయత్నించినా, ఆశించిన…

37 minutes ago

జేడీ చక్రవర్తి భార్య గురించి షాకింగ్ నిజం.. తెలుగులోనే హీరోయిన్..!

తెలుగు సినీ పరిశ్రమలో విభిన్నమైన ప్రయాణం చేసిన నటుల్లో జేడీ చక్రవర్తి ఒకరు. నటుడిగానే కాకుండా రచయితగా, దర్శకుడిగా, సంగీతంపై…

44 minutes ago

“మహిళల ఉసురు తగులుతుంది”.. అమిత్ షా ఫైర్‌తో రాజకీయాల్లో హీట్

లోక్‌సభలో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించే రాజ్యాంగ సవరణ బిల్లు ఆమోదం పొందకపోవడం దేశ రాజకీయాల్లో తీవ్ర చర్చకు…

53 minutes ago

శ్రీరాముడిపై నాగబాబు వ్యాఖ్యలు.. రాజకీయంగా వేడెక్కిన చర్చ

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి ధార్మిక అంశం చర్చకు దారితీసింది. జనసేన పార్టీ ఎమ్మెల్సీ కొణిదెల నాగబాబు ఇటీవల శ్రీరాముడిపై చేసిన…

1 hour ago