Featured

M S Chowdary : ఆడిషన్ కోసం వెళితే మెడబట్టి బయటకు గెంటేసారు… అందుకే కృష్ణవంశీ గారు అంటే కోపం : ఆర్టిస్ట్ ఎం ఎస్ చౌదరి

M S Chowdary : ఎన్నో నాటకాలు వేసిన అనుభవంతో సినిమాల మీద ఆసక్తితో టాలీవుడ్లో తన కెరీర్ ను ప్రారంభించి ఎన్నో సినిమాలలో నటించాడు ఎం ఎస్ చౌదరి. కెరీర్ మొదట్లో బుల్లితెర మీద సీరియల్స్ లో కూడా నటించి అభిమానులను సంపాదించుకున్నాడు. తరువాత కొన్ని సినిమాలలో నటించిన ఎం ఎస్ చౌదరి, వెంకటేష్ హీరోగా వచ్చిన లక్ష్మి సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. తరువాత తేజ డైరెక్షన్లో వచ్చిన నీకు నాకు డాష్ డాష్, రెయిన్బో, జంక్షన్ వంటి సినిమాలలో నటించిన ఎం ఎస్ చౌదరి కి పవన్ కళ్యాణ్ గబ్బర్ సింగ్ సినిమాతో మంచి గుర్తింపు లభించింది. ఇటీవల వచ్చిన భీమ్లా నాయక్ సినిమాతో మంచి పేరు సంపాదించుకున్నాడు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఎం ఎస్ చౌదరి తన కెరీర్ లో ఎదుర్కొన్న చాలా విషయాల గురించి చెప్పుకొచ్చారు.

మెడబట్టి బయటకు గెంటేసారు… తరువాత పిలిచి అవకాశం ఇచ్చారు…

మొదట్లో సినిమాలలో అవకాశాల కోసం చాలా కష్టపడ్డాను అని, ఎక్కడికి అవకాశాల కోసం వెళ్లిన ఆడిషన్ కు పిలిచేవారు కాదని ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. నాతోపాటు వచ్చిన అందరిని పిలిచేవారు కానీ నన్ను మాత్రం వెనక్కి పంపించేవారని చెప్పారు. ఇక ఒక రోజు కృషవంశీ గారి కోసం ఎదురు చూసి ఆయనను కలిసాను, ఆడిషన్స్ కు రమ్మని చెప్పారు. కానీ ఆయన డైరెక్షన్ డిపార్ట్మెంట్లో వాళ్ళు నన్ను బయటకు పంపించేశారు. అందుకే కృష్ణవంశీ అంటే నాకు కోపం అని చెప్పారు.

తరువాత ఒక రోజు తేజ డైరెక్షన్లో క్యారెక్టర్ కోసం ఆడిషన్ కి ట్రై చేయడానికి ఒకరికి ఫుడ్, మందు ఇచ్చి ఎలాగైనా ఆడిషన్స్ కు వెళ్లాలని చూసాం, తీరా అక్కడకు వెళ్ళాక మా ఫ్రెండ్ ను  లోపలికి పంపించారు కానీ నన్ను మెడ బట్టి బయటకు దొబ్బేసారు. కానీ మళ్ళీ తేజ గారు నన్ను ఆయన సినిమాలో చేయమని అడిగారు అపుడు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. టాలెంట్ ఉంటే ఒక రోజు అవమానాలు జరిగిన మళ్ళీ అవకాశాలు వస్తాయి అని చెప్పారు. అంతే కాకుండా కొత్తగా వచ్చేవాళ్ళకి కనీస మర్యాద ఇవ్వాలి అని చెప్పుకొచ్చారు.

Bhargavi

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago