General News

బియ్యానికి పోషకాల జోడింపు.. త్వరలోనే కొత్త బియ్యం పంపిణీ..!

పోషకాహారంపై ప్రభుత్వం ఎన్ని అవగాహన కార్యక్రమాలు చేపట్టినా.. అందులో కొంతమంది వినేవాళ్లు.. మరికొంత మంది పెడచెవిన పెట్టేవాళ్లు ఉన్నారు. అయితే కారోనా కారణంగా ప్రపంచవ్యాప్తంగా కూడా పోషకాహారంపై ప్రజలకు అవగాహన పెరిగిపోయింది. అన్ని రకాల పోషకాలు ఉండే సమతులాహారం తీసుకుంటే అనారోగ్యాలకు దూరంగా ఉండవచ్చనే విషయాన్ని ప్రజలు అర్థం చేసుకుంటున్నారు. దీనిలో భాగంగా.. పోర్టిఫికేషన్ రైస్ ను 2024 నాటికి ప్రజలకు అందించాలని ప్రధాని నరేంద్ర మోదీ స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగంలో పేర్కొన్నాడు.

బియ్యానికి పోషకాల జోడింపు ద్వారా ఆరోగ్యం అందించాలనేది ఫోర్టిఫికేషన్ ప్రధాన ఉద్దేశం. రైస్ ఫోర్టిఫికేషన్ అంటే.. బియ్యానికి అదనంగా ఖనిజాలు, సూక్ష్మ పోషకాలు కలపడాన్ని రైస్ ఫోర్టిఫికేషన్ అంటారు. దీనిని FSSAI నిర్వహించింది. రైస్ ఫోర్టిఫికేషన్ అనేది సాధారణ బియ్యానికి సూక్ష్మపోషకాలను జోడించే ప్రక్రియ. ఇలా కలిపిన బియ్యాన్ని పీడీఎస్ ల ద్వారా పంపిణీ చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. దీని కోసం కోటింగ్, డస్టింగ్ పద్దతులు ఉన్నాయి. ఇండియాలో రైస్ ఫోర్టిఫికేషన్ కోసం ‘ఎక్స్‌ట్రాషన్’ అనేది మంచి టెక్నాలజీ అని నిపుణులు చెబుతున్నారు.

ఇలా చేసిన వాటిని 12 నెలల లోపు వినియోగించాలని తెలిపారు. ఇండియాలో ఇప్పటికీ చాలామంది మహిళలు పిల్లలు పోషకాహార లోపంతో బాధపడుతున్నారు. ప్రతీ ఇద్దరు మహిళల్లో ఒకరు రక్తహీనతతో బాధపడుతున్నారని అంచానా. గ్లోబల్ హంగర్ ఇండెక్స్ లో కూడా భారత్ స్థానం 94. దీంతో ఈ ర్యాంక్ భారత్ లో ఆహార కొరత ఎంత ఉందనేది చూపిస్తుంది. అందువల్ల పేద ప్రజలు వినియోగిస్తున్న బియ్యానికి సూక్ష్మపోషకాలను కలిపి, వారి ఆరోగ్యాన్ని మెరుగుపరచాలని ప్రభుత్వం భావిస్తోంది. మన ఇళ్లలో సాధారణంగా అన్నం వండే పద్ధతిలోనే ఈ ఫోర్టిఫైడ్ రైస్‌తో అన్నం వండుకోవచ్చు. మన దేశంలో దాదాపు 2,690 రైస్ మిల్లులు ఫోర్టిఫైడ్ రైస్ ఉత్పత్తి చేయడానికి బ్లెండింగ్ యూనిట్లను ఏర్పాటు చేశాయని ప్రభుత్వం చెబుతోంది.

ఐరన్, ఫోలిక్ యాసిడ్, విటమిన్ బి12 వంటి మూడు సూక్ష్మపోషకాలు ఉండే FRK ఉత్పత్తికి ఖర్చు కిలోకు 60 పైసల వరకు మాత్రమే అవుతుందని మంత్రిత్వ శాఖ అంచనా వేసింది. బలవర్థకమైన బియాన్ని ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా ప్రజలకు అందించేందుకు 2019-20లో పైలట్ పథకాన్ని ప్రభుత్వం ప్రారంభించింది. ఆంధ్రప్రదేశ్, కేరళ, కర్ణాటక, మహారాష్ట్ర, ఒడిశా, గుజరాత్, ఉత్తర ప్రదేశ్, అస్సాం, తమిళనాడు, తెలంగాణ, పంజాబ్, ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్, ఉత్తరాఖండ్, మధ్యప్రదేశ్‌.. వంటి 15 రాష్ట్రాల్లోని 15 జిల్లాల్లో పైలట్ పథకం ప్రారంభమైంది. ఇప్పటి వరకు ప్రపంచంలో ఫోర్టిఫైడ్ రైస్ ను ఏడు దేశాలు పంపిణీ చేస్తున్నాయి. అందులో అమెరికా, పనామా, కోస్టా రికా, నికరాగ్వా, పపువా న్యూ గినియా, ఫిలిప్పీన్స్, సోలొమన్ ఐలాండ్స్.. వంటి దేశాలు ఈ జాబితాలో ఉన్నాయి.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago