Featured

సీన్ సరిగ్గా చేయలేదని రజనీకాంత్ ను.. కొట్టిన డైరెక్టర్ ఎవరో తెలుసా?

సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో ఒక సినిమా తెరకెక్కించేటప్పుడు నటీనటులు ఎక్కువ టేక్ లు తీసుకుంటే డైరెక్టర్లు వారిపై కొంతమేర ఆగ్రహం వ్యక్తం చేస్తుంటారనే సంగతి మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే నటీనటులు ఈ విషయాన్ని గుర్తు పెట్టుకొని ఒక సీన్ ఎక్కువ టేకులు తీయకుండా వీలైనంత తొందరగా పూర్తి చేసుకోవడానికి ప్రయత్నిస్తుంటారు. సినిమా ఇండస్ట్రీలో ఒక లెజెండ్ గా యావత్ దేశం మొత్తం అభిమానించే హీరోగా, నటనలో తనకు ఎవరూ సాటి లేరన్న పేరు సంపాదించుకున్న నటుడు రజనీకాంత్ ఓ టెకులో సరిగా నటించకపోవడంతో ఏకంగా డైరెక్టర్ అతనిపై చేయి చేసుకున్న సంఘటనలు కూడా ఉన్నాయి. ఇంతకీ ఆ డైరెక్టర్ ఎవరు ఆ సంగతులు ఏమిటి అనే విషయాలను తెలుసుకుందాం..

తమిళ సినిమా ఇండస్ట్రీలో హీరోగా ఎంతో మంచి పేరు తెచ్చుకున్న రజినీకాంత్ మొట్టమొదటిసారిగా కె.బాలచందర్ దర్శకత్వంలో తెరకెక్కిన “అపూర్వ రాగంగళ్” సినిమాతో నటునిగా వెండితెర పై అడుగు పెట్టాడు. రజినీకాంత్ బాలచందర్ దర్శకత్వంలో చేసిన సినిమాల ద్వారా మంచి గుర్తింపును సంపాదించుకున్నారు. ఈ క్రమంలోనే రజనీకాంత్ శ్రీదేవి జంటగా మొట్టమొదటిసారి బాలచందర్ దర్శకత్వంల ‘మూండ్రు ముడిచ్చు’ అనే సినిమాలో నటించారు. అప్పటికి శ్రీదేవి వయసు 13 సంవత్సరాలు.

బాలచందర్ దర్శకత్వంలో నటించే నటీనటులు ఎంతో జాగ్రత్తగా నటిస్తారు. ఎందుకంటే నటీనటులు ఒక సన్నివేశం కోసం ఎక్కువ టేకులు తీసుకుంటే అతనికి నచ్చదు. అయితే నటీనటులు అద్భుతంగా నటిస్తే మాత్రం వారిని “వెరీగుడ్” అంటూ ప్రశంసించే వారు. ఈ క్రమంలోనే ఈ సినిమాలో శ్రీదేవి రజనీకాంత్ ఇద్దరు పోటీ పెట్టుకొని మరి నటించారు.

ఈ సినిమాలో ఒక సన్నివేశం తీసే సమయంలో రజినీకాంత్ అధిక టేకులు తీసుకొని సరిగా నటించకపోవడంతో బాలచందర్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ రజిని పై చేయి చేసుకున్నట్లు అప్పట్లో ఓ ఇంటర్వ్యూ ద్వారా శ్రీదేవి ఈ విషయాన్ని వెల్లడించారు. శ్రీదేవి కూడా ఒక సన్నివేశం కోసం ఏకంగా 13 టేకులు తీసుకున్నారని 14వ టేక్ కి దర్శకుడు ఓకే చెప్పినట్లు తెలిపారు. మరొక విషయం ఏమిటంటే ఈ సినిమాలో రజనీకాంత్ కన్నా శ్రీదేవికి ఎక్కువ రెమ్యూనరేషన్ ఇవ్వడం గమనార్హం.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago