Faima: దేశంలో నెంబర్ వన్ రియాలిటీ షో గా గుర్తింపు పొందిన బిగ్ బాస్ రియాలిటీ షో తెలుగులో కూడా ప్రసారమవుతూ మంచి ప్రేక్షకాదరణ సొంతం చేసుకుంది. ఇప్పటికే ఐదు సీజన్లు పూర్తి చేసుకున్న ఈ రియాలిటీ షో ప్రస్తుతం ఆరవ సీజన్ కొనసాగుతోంది. ఈ ఆరవ సీజన్ ప్రారంభమై ఇప్పటికే 13వారాలు పూర్తి చేసుకుని 14వ వారంలో కొనసాగుతోంది. గత వారంలో జరిగిన ఎలిమినేషన్ లో జబర్దస్త్ ఫేమ్ ఫైమా ఎలిమినేట్ అయ్యింది.
బిగ్ బాస్ హౌస్ లో స్ట్రాంగ్ కంటెస్టెంట్ గా ఉన్న పైమా ఇలా ఎలిమినేట్ అవ్వటంతో ఆమె అభిమానులు షాక్ అయ్యారు. తన కామెడీతో హౌస్ మెట్స్ ని మాత్రమే కాకుండా ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తూ బిగ్ బాస్ ఇచ్చిన టాస్కులలో యాక్టివ్ గా పాల్గొంటూ స్ట్రాంగ్ కంటెస్టెంట్ గా ఉన్న ఫైమా అనూహ్యంగా ఇలా ఎలిమినేట్ అవ్వడంతో బిగ్ బాస్ హౌస్ లో సందడి తగ్గినట్లు తెలుస్తోంది.
బిగ్ బాస్ హౌస్ లో స్ట్రాంగ్ కంటెంట్ గా ఉంటూ టాప్ ఫైవ్ కంటెస్టెంట్లలో ఒకరిగా నిలవాల్సిన పైమా ఆమె చేసిన కొన్ని పొరపాట్ల వల్ల నెగెటివిటీ మూట కట్టుకొని ఇలా ఎలిమినేట్ అయ్యింది. ఇదిలా ఉండగా ఫైమా ఎలిమినేట్ అయ్యి బిగ్ బాస్ హౌస్ నుండి బయటికి రావటంతో ఆమె రెమ్యూనరేషన్ విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.
సాధారణంగా బయట ఉన్న పాపులారిటీని బట్టి బిగ్ బాస్ కంటెస్టెంట్లకు రెమ్యూనరేషన్ ఉంటుంది. ఇక జబర్దస్త్ కమెడియన్ గా ఫైమా కి మంచి గుర్తింపు ఉండటంతో బిగ్ బాస్ యాజమాన్యం వారు ఆమెకి వారానికి దాదాపు 30 వేల వరకు రెమ్యూనరేషన్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇలా 13 వారాలపాటు బిగ్ బాస్ హౌస్ లో కొనసాగిన ఫైమా అధిక మొత్తంలో రెమ్యూనరేషన్ అందుకున్నట్లు తెలుస్తోంది.అందుతున్న సమాచారం ప్రకారం 13 వారాలకు గాను దాదాపు నాలుగు లక్షల వరకు ఫైమా రెమ్యూనరేషన్ అందుకున్నట్లు సమాచారం. ఇలా అధిక మొత్తంలో రెమ్యూనరేషన్ అందటంతో ఫైమా కూడా సంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది.
ఈ దేశంలో అన్ని భాషల్లోనూ, అన్ని రాష్ట్రాల్లోనూ ఎన్నో పీఠాలు, మఠాలు, దేవస్థానాలు, ధార్మిక మండళ్ళూ, ట్రస్ట్ లు, ధార్మిక…
అద్భుత మంత్ర శక్తులతో, మంత్ర రహస్యాలతో, మంత్ర విశేషాలతో మరీ ముఖ్యంగా మహా బలాలకే మహా బలాన్నిచ్చే పరమాద్భుత నృసింహ…
భారత రూపాయి చరిత్రలో ఎన్నడూ లేని స్థాయిలో పతనమవుతోంది. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ రోజురోజుకు దిగజారుతూ ఆల్‌టైం…
చలికాలం వచ్చిందంటే చాలు.. చాలా మందికి ఒక విచిత్రమైన అనుభవం ఎదురవుతుంటుంది. కారు డోర్ తీస్తున్నా, కుర్చీలో కూర్చుంటున్నా, కనీసం…
నేటి ఉరుకుల పరుగుల జీవితంలో మానసిక ప్రశాంతతకు, శారీరక దృఢత్వానికి చాలామంది యోగాను ఆశ్రయిస్తున్నారు. అయితే, యోగా చేసేవారిని తరచుగా…
చేపలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయనడంలో సందేహం లేదు. అయితే, చేపలను ఏ ఆహారాలతో కలిపి తింటున్నాం అన్నదే అసలు…