Fida Movie: జయంత్ సి పరాన్జీ ప్రేమించుకుందాం రా సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు దర్శకుడిగా పరిచయమయ్యారు. ఈయన దర్శకత్వంలో ఎన్నో అద్భుతమైన సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. అయితే ఈయన తెలుగులో పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన తీన్ మార్ సినిమాకి చివరిగా దర్శకత్వం వహించారు.
ఈ సినిమా తర్వాత చాలా కాలం పాటు తెలుగు చిత్ర పరిశ్రమకు దూరంగా ఉన్నటువంటి ఈయన తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు.ఈ ఇంటర్వ్యూ సందర్భంగా వరుణ్ తేజ్ సాయి పల్లవి జంటగా నటించిన ఫిదా సినిమా గురించి పలు విషయాలను తెలియజేశారు.శేఖర్ కమ్ముల ఫిదా స్టోరీ మహేష్ బాబు ని దృష్టిలో పెట్టుకొని రాసారని అయితే ఈ స్టోరీ నాకు చెప్పగా చాలా నచ్చడంతో ఈ సినిమాకు తానే నిర్మాతగా వ్యవహరిస్తానని చెప్పినట్లు వెల్లడించారు.
ఈ సినిమాలో మహేష్ బాబు హీరోగా చేయగా దీపికా పదుకొనేని హీరోయిన్గా తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేయాలని భావించాము. ఈ కథ విన్నటువంటి మహేష్ బాబు కూడా చాలా ఇంప్రెస్ అయ్యారని వెంటనే సినిమా చేయాలని కూడా భావించాము. కానీ మహేష్ వంటి స్టార్ హీరో నుంచి సినిమా వస్తుంది అంటే ప్రేక్షకులు అంచనాలు ఓ రేంజ్ లో ఉంటాయి.
ఈ క్రమంలోనే ఫిదా సినిమా ద్వారా ఆ అంచనాలను చేరుకోలేమన్న ఉద్దేశంతో ఈ ఆలోచనని విరమించుకున్నామని తెలిపారు. ఇలా మహేష్ బాబు ఈ సినిమా నుంచి తప్పుకోవడంతో వరుణ్ తేజ్ సాయి పల్లవి ఇద్దరు కూడా ఫిదా సినిమాలో నటించారని ఈ సందర్భంగా డైరెక్టర్ జయంత్ చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…