Shakeela: సినిమా ఇండస్ట్రీలో ఒకానొక సమయంలో ఎన్నో అద్భుతమైన సినిమాలలో నటిస్తూ ఓ రేంజ్ లో పాపులారిటీని సొంతం చేసుకున్నటువంటి వారిలో నటి షకీలా ఒకరు.షకీలా ఏ సినిమాలో అయినా నటించింది అంటే కేవలం ఆమెను చూడటం కోసమే ప్రేక్షకులు పెద్ద ఎత్తున థియేటర్లకు తరలి వెళ్లేవారు. ఇక షకీలా ప్రధాన పాత్రలో నటించిన సినిమాలు విడుదల అవుతున్నాయి అంటే స్టార్ హీరోల సినిమాలు కూడా వాయిదా వేసుకునేవారు.
ఈ విధంగా దక్షిణాది సినీ ఇండస్ట్రీలో ఎంతో పేరు ప్రఖ్యాతల సంపాదించుకొని అత్యధిక రెమ్యూనరేషన్ అందుకుంటూ ఇండస్ట్రీలో వెలుగు వెలిగినటువంటి షకీలాకు ప్రస్తుతం సినిమా అవకాశాలు లేక ఏదో బుల్లితెర కార్యక్రమాలలోను రియాలిటీ షో లలోను నటిస్తూ సందడి చేస్తున్న విషయం మనకు తెలిసిందే. ఇలా పూటగడపకోవడం కోసం ఈమె ఎన్నో కష్టాలు పడుతున్నారు.
ఇకపోతే చాలామంది ఈమె గురించి మాట్లాడుతూ షకీల చాలా లగ్జరీ లైఫ్ గడుపుతున్నారని ఆమె బిఎండబ్ల్యూ కార్లలో తిరుగుతూ తన జీవితాన్ని సంతోషంగా గడుపుతున్నారు అంటూ వార్తలు సృష్టించారు. అయితే తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి ఈమె ఈ వార్తలపై స్పందించి వీటిని ఖండించారు. ఈ సందర్భంగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న షకీలా తన గురించి వస్తున్నటువంటి వార్తలపై స్పందిస్తూ…
తాను బీఎండబ్ల్యూ కార్లలో తిరుగుతున్నానని చాలామంది భావిస్తున్నారు. నిజానికి తాను ఉండటానికి సొంత ఇల్లు కూడా లేకపోవడంతో అద్దె ఇంట్లో నివసిస్తున్నానని తెలిపారు.సినిమా ఇండస్ట్రీలో తాను ఒకప్పుడు రోజుకు నాలుగు లక్షల రూపాయల వరకు రెమ్యూనరేషన్ తీసుకుని బాగా సంపాదించాను. అయితే ఇన్కమ్ టాక్స్ రైడ్ జరుగుతుందన్న ఉద్దేశంతో తన సోదరి ఆస్తులన్నీ తన పేరు మీదట రాయించుకొని తనని దారుణంగా మోసం చేసిందని అందుకే ఇప్పుడు తాను అద్దె ఇంట్లో ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది అంటూ ఈ సందర్భంగా ఈమె చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…