Ram Charan Vs Yash: సౌత్ ఇండియా స్టార్స్ రామ్ చరణ్, యశ్ ఫ్యాన్స్ మధ్య చెలరేగిన వివాదం… ఆగ్రహం వ్యక్తం చేస్తున్న నెటిజన్లు!
Ram Charan Vs Yash:సౌతిండియా స్టార్ గా ఎంతో మంచి క్రేజ్ సంపాదించుకుని ప్రస్తుతం పాన్ ఇండియా సినిమాలలో నటించి జాతీయస్థాయిలో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న హీరోలు రామ్ చరణ్, కన్నడ సినీ నటుడు యశ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. వీరిద్దరూ వారి అద్భుతమైన నటనతో సౌత్ ఇండస్ట్రీలోనే కాకుండా జాతీయ స్థాయిలో కూడా ఎంతో మంచి గుర్తింపు పొందారు.
రామ్ చరణ్ నటించిన RRR సినిమాలోని అల్లూరి సీతారామరాజు పాత్ర ప్రతి ఒక్క ప్రేక్షకుడిని ఎంతగానో ఆకట్టుకుంది. ముఖ్యంగా హిందీ ప్రేక్షకులు అల్లూరి గెటప్ లో ఉన్న రామ్ చరణ్ కి వీరాభిమానులు మారిపోయారు. అదేవిధంగా కేజిఎఫ్ చిత్రం ద్వారా బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టించిన ఈ సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.
కేజిఎఫ్ సినిమాలో యష్ మాస్ లుక్ ప్రతి ఒక్క ప్రేక్షకుడిని ఎంతగానో ఆకట్టుకుంది. ఈ విధంగా సౌత్ స్టార్స్ పాన్ ఇండియా హీరోగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న నేపథ్యంలో వీరి అభిమానుల మధ్య సోషల్ మీడియా వేదికగా పెద్ద వార్ జరుగుతుంది. ఇంతకీ అభిమానులు ఏ విషయం గురించి గొడవ పడుతున్నారనే విషయానికి వస్తే… మా హీరో బియర్డ్ (గడ్డం) లుక్ లోఅందంగా ఉన్నారు అంటే మా హీరో అందంగా ఉన్నారని ఈ ఇద్దరీ హీరోల అభిమానులు పెద్ద ఎత్తున గొడవ పడుతున్నారు.
ఈ క్రమంలోనే సోషల్ ట్విటర్ లో #RamVsYash హ్యాష్ ట్యాగ్ ఒక రేంజ్ లో ట్రెండింగ్ గా ఇద్దరు అభిమానుల మధ్య వార్ జరుగుతున్న నేపథ్యంలో సామాన్య నెటిజన్లు ఈ విషయంపై స్పందిస్తూ అసహనం వ్యక్తం చేస్తున్నారు. వీరిద్దరు కూడా సొంత టాలెంట్ తో పాన్ ఇండియా హీరోలుగా మారిపోయారు.ఇలా తమ టాలెంట్ తో పాన్ ఇండియా హీరోగా మారి ఎంతో మందికి అభిమానులుగా మారిన ఈ హీరోల బియర్డ్ (గడ్డం) లుక్ గురించి గొడవ పడటం చాలా సిల్లీగా ఉంది అంటూ కామెంట్లు చేస్తున్నారు.
కొందరు మాత్రం యష్, రాంచరణ్ ఇద్దరూ తిరుగులేని హీరోలు అని కామెంట్ చేయగా మరికొందరు మాత్రం బియర్డ్ లుక్ యష్ కి బాగా సెట్ అవుతుందంటూ కామెంట్ చేస్తున్నారు. అదేవిధంగా మరికొందరు బియర్డ్ లుక్ రామ్ చరణ్ కి కూడా బాగా సెట్ అయ్యిందంటూ కామెంట్లు చేస్తున్నారు.యశ్ కేజిఎఫ్ సినిమాలో గడ్డంతో అందరినీ ఆకట్టుకున్నారు. ఇక రామ్ చరణ్ రంగస్థలం, RRR లో బియర్డ్ లుక్ లో అందరినీ ఆకట్టుకున్నారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…