Kamal R khan again comment on south films: బాలీవుడ్ లో ఇపుడు సౌత్ సినిమాల హవా నడుస్తోంది. బడా బాబులకేమో కానీ మాములు జనాలు మాత్రం సౌత్ సినిమాలను సౌత్ హీరోలను ఆదరిస్తున్నారు. ఇక పుష్ప సినిమా బాలీవుడ్ మార్కెట్ ఊపేసింది. ఇక కేజీఎఫ్ గురించి చెప్పక్కర్లేదు. కేజీఎఫ్ చాప్టర్ 1 వల్ల యష్ కు బాలీవుడ్ లో బాగా క్రేజ్ వచ్చింది. ఈ విషయం ఇటీవల కేజీఎఫ్ చాప్టర్ 2 ప్రమోషన్స్ లోనే యష్ కు ప్రశాంత్ కు అర్థమైంది. ఇక ఆర్ఆర్ఆర్ సినిమా బాలీవుడ్ బాక్స్ ఆఫీస్ తుప్పు వదిలించి ఇండియన్ సినిమాల్లో టాప్ 3 లో ఉంది. ఇంత విజయాలు సాధిస్తున్నా బాలీవుడ్ సెలబ్రిటీలు ఆ సినిమాల గురించి ఒక మాటైనా మాట్లాడక పోవడం సోషల్ మీడియాలో ప్రస్తావించక పోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది.
బాలీవుడ్ క్రిటిక్ పైత్యం…..
ఇక బాలీవుడ్ క్రిటిక్ గా చెప్పుకునే కమల్ ఆర్ ఖాన్ ఆర్ఆర్ఆర్ విడుదల సమయంలో ఆర్ఆర్ఆర్ చెత్త సినిమా అంటూ రాజమౌళి ని జైలులో వేయాలని కామెంట్స్ చేసి వైరల్ అయ్యాడు. ఇక కేజీఎఫ్ టైములో మళ్ళీ ఆర్ఆర్ఆర్ కన్నా కేజీఎఫ్ ఇంకా చెత్త సినిమా అని డైరెక్టర్ కు బుర్ర లేదంటూ ఘాటుగా మాట్లాడాడు. ఇక ప్రశాంత్ నీల్ ను కూడా జైల్లో పెట్టాలని సినిమా బాగుందన్న ప్రేక్షకులను చూస్తే జాలి కలుగుతోందని కామెంట్స్ చేసాడు. ఇక అంతటితో ఆగకుండా ఇపుడు ఏకంగా ఆర్ఆర్ఆర్ కంటే గొప్ప సినిమా కేవలం 50కోట్ల బడ్జెట్ లో తాను తీయగలనని ఆ సినిమా ఖచ్చితంగా 400నుండి 500 కోట్లు వసూలు చేస్తుందంటూ కామెంట్స్ చేస్తూ వైరల్ అవుతున్నాడు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…