RGV Tweet on Mega and Allu family: మెగాస్టార్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో నటించిన చిత్రం ఆచార్య. ఈ చిత్రంలో రామ్ చరణ్ ముఖ్యమైన పాత్రలో నటించారు. భారీ అంచనాలతో ఏప్రిల్ 29న ఈ చిత్రం విడుదల కాబోతున్నది. ప్రమోషన్స్ లో భాగంగా చిత్ర యూనిట్ ఓ స్పెషల్ వీడియో ద్వారా ఈ సినిమాలోని ‘భలే భలే బంజారా’సాంగ్ విడుదల తేదిని ప్రకటించింది.
చిరు మరియు చరణ్ వీడియో మీద ఆర్జీవి ట్వీట్….
చిరు మరియు చరణ్ మధ్యలో జరిగిన సరదా సంభాషణకు సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతున్నది.ఈ వీడియో పై వివాదాలకు కేర్ అఫ్ అడ్రస్ గా వుండే రామ్ గోపాల్ వర్మ తనదైన శైలిలో స్పందించాడు.ఈ వీడియోపై రామ్ గోపాల్ వర్మ తన ట్విట్టర్ ద్వారా సంచలన వ్యాఖ్యలు చేశాడు. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట్లో వైరల్ అవుతోంది.
రామ్ గోపాల్ వర్మ ఈ వీడియో పై తన ట్వీటర్ లో ఇలా స్పందించారు.. నేను చాలా హర్ట్ అయ్యాను. మెగా ఫాదర్ మరియు మెగా సన్ తమ ప్రమోషనల్ వీడియోలో తగ్గు తగ్గను అని మాట్లాడటం చూస్తుంటే వారు అల్లు అర్జున్ తగ్గేదేలే డైలాగ్ వాడడం ద్వారా తదుపరి మెగా హీరో అల్లునే అని వారు చెబుతున్నట్లు నేను ఫీల్ అవుతున్నాను అని రామ్ గోపాల్ వర్మ తన ట్వీటర్ లో పేర్కొన్నారు. ఈయన ట్వీట్ మెగా, అల్లు అభిమానుల మధ్య అభిప్రాయ బేధాలకు తెర తీసేలా వున్నాయని అభిప్రాయపడుతున్నారు. మెగా అభిమానులు ఆర్జీవీ ట్వీట్ కు గట్టిగానే రిప్లై ఇస్తునారు. “మాస్టారు ..అక్కడ వాడిన పదం “తగ్గను”..”తగ్గాలి” అని మాత్రమే.. “తగ్గేదిలే” అని మాత్రం కాదు.. ఐనా “తగ్గెదిలే” అన్న పదం.. నువ్వు పుట్టిన తరువాత పుట్టినట్టు చెప్తావు” అంటూ ఘాటు రిప్లై ఇస్తున్నారు. మరికొందరు ఆచార్య సినిమా ప్రమోట్ చేస్తున్నందుకు దాన్యవాదాలు అంటూ సెటైరికల్ గా కామెంట్లు చేస్తున్నారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…