Categories: FeaturedMovie News

తెలుగు సినీ పరిశ్రమలో మొదటి ఫ్యాక్షన్ సినిమా ఏమిటో మీకు తెలుసా.?!

రెగ్యులర్ కమర్షియల్ ఎలిమెంట్స్ తో వచ్చిన సినిమాలను చూసి, చూసి విసిగిపోయినా తెలుగు ప్రేక్షకులు భిన్నమైన కథాంశంతో వచ్చిన ఏ సినిమా అయినా చూడడానికి సిద్ధంగా ఉన్న పరిస్థితుల్లో ఫ్యాక్షన్ సినిమాలు రావడంతో అవి కొత్తగా అనిపించి వాటిని తెలుగు ప్రేక్షకులు చూడడం ప్రారంభించారు.

అలా ఫ్యాక్షన్ నేపద్యంలో వచ్చిన ప్రేమించుకుందాం రా, సీతారామరాజు, సమరసింహా రెడ్డి, అంతపురం, ఇంద్ర, ఆది, నరసింహ నాయుడు, చెన్నకేశవరెడ్డి, సీమ సింహం, దమ్ము, మిర్చి, అరవింద సమేత వీర రాఘవ లాంటి సినిమాలన్నీ దాదాపు బాక్స్ ఆఫీసు వద్ద రికార్డులు సృష్టించాయి. నిర్మాతలకు ఈ సినిమాలతో కనకవర్షం కురిసింది. టాప్ స్టార్స్ రాయలసీమ ఫ్యాక్షన్ నేపథ్యంలో ఒక్క సినిమా అయినా చేయాలని కథా రచయితలను కోరే పరిస్థితి కూడా వచ్చింది. అలా తమ అభిమాన హీరో నటించిన ఫ్యాక్షన్ నేపధ్య సినిమాలకి ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు.

ఈ బ్లాక్ బస్టర్ సినిమాల కంటే ముందే తెలుగులో1990 ప్రథమార్థంలో రాయలసీమ ప్రాంత నేపథ్యంలో ఒక సినిమా వచ్చింది. 1991లో ఆర్.సి.క్రియేషన్స్ పతాకంపై రాధాకృష్ణ చలపతిరావు నిర్మాతలుగా కడప రెడ్డెమ్మ సినిమా వచ్చింది. రగులుతున్న రాయలసీమ జీవన బతుకుల్ని కళ్ళకు కట్టినట్టుగా ఈ సినిమాను దర్శకుడు తమ్మారెడ్డి భరద్వాజ చూపించడం జరిగింది. మోహన్ బాబు, శారద, రంజిత గిరిబాబు, నర్ర, అన్నపూర్ణ, చలపతిరావు మొదలగువారు ఈ సినిమాలో ప్రధాన తారాగణం. ఇప్పటి ఫ్యాషన్ నేపధ్య సినిమాలకి మొదటగా కడప రెడ్డెమ్మ సినిమా పరుచూరి బ్రదర్స్ కలం నుంచి జాలువారిన చిత్రంగా పేర్కొనవచ్చు.

telugudesk

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…

1 month ago

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

3 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

3 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

4 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

4 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

4 months ago