Featured

ఎస్.పి.శైలజ ఆ సీన్ చూసిన తర్వాత సుధాకర్ ను ఎందుకు కాల్చిపారేయమందో తెలుసా?!

సుధాకర్ మొదటి సినిమాతోనే కళాతపస్వి కె.విశ్వనాధ్ దర్శకత్వంలో వచ్చిన శుభలేఖ సినిమాలో నటించడం జరిగింది. అలా 1982లో మొదలైన నటనా ప్రస్థానం పులి, అన్వేషణ, లేడీస్ టైలర్, అహ నా పెళ్ళంట, మేడం, కలెక్టర్ గారి అబ్బాయి, శివ, కలికాలం, నేటి చరిత్ర, ప్రేమించుకుందాం రా, పెళ్లి చేసుకుందాం, పవిత్ర బంధం, దమ్ము, ఒక లైలా కోసం, అరవింద సమేత వీర రాఘవ లాంటి చిత్రాల్లో శుభలేఖ సుధాకర్ నటించారు.

పీసీ.శ్రీరామ్ అనగానే దర్శకుడు మణిరత్నం సినిమాలు గుర్తుకు వస్తుంటాయి.ప్రేక్షకుల కల్లే తన కళ్లు గా భావించి.. పీసీ.శ్రీరామ్ అందమైన సృజనాత్మక,దృశ్యాలను తన కెమెరాలో బంధిస్తాడు. నాయకుడు, గీతాంజలి, దొంగ దొంగ లాంటి చిత్రాలకు పి.సి.శ్రీరామ్ కెమెరామెన్ గా పనిచేశారు. ఆ తర్వాత పీసీ శ్రీరామ్1995లో కమలహాసన్,అర్జున్ హీరోలుగా గౌతమి హీరోయిన్ గా ద్రోహి అనే చిత్రాన్ని తీయడం జరిగింది.

హింసా, రాజకీయాలు పెచ్చరిల్లిపోతున్నా తరుణంలో దేశభక్తి ప్రధాన ఉద్దేశంగా వచ్చిన చిత్రమే ద్రోహి. ఉగ్రవాద కార్యకలాపాలతో భారతదేశాన్ని ఏ విధంగా భయబ్రాంతులకు గురి చేస్తున్నారో అనే అంశాన్ని ఆధారంగా చేసుకొని ద్రోహి సినిమా రూపొందించడం జరిగింది. కమలహాసన్, అర్జున్ పోలీస్ ఆఫీసర్స్ గా నాజర్ ఉగ్రవాదిగా ఈ సినిమాల్లో కనిపించారు.

ఈ సినిమా 1995 అక్టోబర్ లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ద్రోహి ప్రివ్యూ చూడడానికి కె.విశ్వనాథ్, కమల్ హాసన్ తో పాటుగా శుభలేఖ సుధాకర్ తన భార్య శైలజ తో ఈ సినిమా ప్రివ్యూ చూడడానికి రావడం జరిగింది. ద్రోహి చూస్తున్న సమయంలో ముందుగానే శుభలేఖ సుధాకర్ ఈ సినిమాలో అసభ్యకర సన్నివేశం ఉంటుందని చెప్పినప్పటికీ ఎస్.పి శైలజ సినిమాలో నిమగ్నమైపోయారు.

అయితే ద్రోహి సినిమాలో సుధాకర్, గౌతమి తో మిస్ బిహేవ్ సీన్ ఒకటి ఉంటుంది. సినిమాలో అలాంటి సీన్ చూసి తట్టుకోలేకపోయిన ఎస్.పి.శైలజ సుధాకర్ ని కాల్చి పారేయండంటూ.. కేక వేయడంతో చుట్టూ ఉన్న ప్రముఖులు ఆశ్చర్యకితులయ్యారు. తర్వాత తేరుకున్న శైలజ ఇది సినిమా కదా అని భావించి తిరిగి ఇంటికి వెళ్ళిపోయారు.

telugudesk

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago