Flash Back : 90s లో స్టార్ హీరోలైన చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్, నాగార్జున పోలీస్ గా వివిధ రకాలైన చిత్రాల్లో కనిపించారు. ఆ చిత్రాల విజయ పరంపర ఎలా ఉందో చూద్దాం…
1991 శ్రీ జయభేరి ఆర్ట్ ప్రొడక్షన్స్ ప్రియదర్శన్ దర్శకత్వంలో నిర్ణయం చిత్రం విడుదలైంది. ఈ సినిమాలో నాగార్జున అమల హీరో హీరోయిన్లుగా నటించారు. సంక్షిప్తంగా కథలోకి వెళితే..
వంశీకృష్ణ (నాగార్జున) నిజాయితీ గల రక్షక భటుడు. జైలు నుండి తప్పంచుకున్న రఘురాం (మురళిమొహన్)ను వెతుకుతూ హైదారాబాదు వచ్చి రఘురాం కూతురు అయిన గీత (అమల)తో ప్రేమలో పడి, రఘురాం అమాయకత్వం చూసి, రఘురాం పై గల case ను తిరగదొడి, శరత్ సక్సెనా తన స్నేహితుడైన శుభలేఖ సుధాకర్ ను చంపాడని తెలుసుకోని, స్టెడియంలో బాంబు వుంది అని గందరగొళం సృష్టించి, రఘురాం చేతిలో చనిపొయెలా చేస్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందన్నది మిగతా కథాంశం.
ఇక పోతే 1992లో పోలీస్ పాత్రలో బాలకృష్ణ దూసుకు వచ్చారు. టి.త్రివిక్రమరావు నిర్మాణం, బి.గోపాల్ దర్శకత్వంలో “రౌడీఇన్స్పెక్టర్” చిత్రం విడుదలయ్యింది. ఈ సినిమాలో బాలకృష్ణ, విజయశాంతి హీరో, హీరోయిన్లుగా నటించారు. లోగడ బాలకృష్ణ హీరోగా బి.గోపాల్ దర్శకత్వంలో వచ్చిన “లారీడ్రైవర్” చిత్రం విజయవంతం కాగా మళ్లీ ఈ ఇద్దరి కాంబినేషన్ లో రౌడీ ఇన్స్పెక్టర్ చిత్రం రూపుదిద్దుకుంది. పవర్ ఫుల్ పోలీస్ఆఫీసర్ పాత్రలో బాలకృష్ణ ఇరగదీశారు. పరుచూరి బ్రదర్స్ రాసిన సంభాషణలు బాలయ్యబాబు పలికిన తీరు ఆయన అభిమానులను హోరెత్తించాయి. బప్పీలహరి అందించిన పాటలు రౌడీఇన్స్పెక్టర్ చిత్రాన్ని మరో స్థాయికి తీసుకెళ్లాయి.
1994 సురేష్ ప్రొడక్షన్స్,డి సురేష్ నిర్మాణం, కె.మురళీమోహన్ రావు దర్శకత్వంలో “సూపర్ పోలీస్” చిత్రం విడుదల అయ్యింది. ఈ సినిమాలో వెంకటేష్, నగ్మా, సౌందర్య హీరోహీరోయిన్లుగా నటించారు…. సంక్షిప్తంగా కథలోకి వెళితే…. విజయ్ ( వెంకటేష్ ) నిజాయితీగల పోలీసు ఇన్స్పెక్టర్. అతని గత ప్రేయసి భారతి ( సౌందర్య ) అనే జర్నలిస్టు రోడ్డు ప్రమాదంలో మరణిస్తుంది. ఆ రోజు నుండి, అతను తాగుబోతు అయ్యాడు. విజయ్ ఒక జర్నలిస్ట్ రేణుక ( జయసుధ ) ఇంటికి అద్దెకు వస్తాడు, ఆమె తన భర్త ఎస్.పి.ప్రకాష్ ( అహుతి ప్రసాద్ ) నుండి, అతడి అనైతిక ప్రవర్తన కారణంగా, విడాకులు తీసుకుని,, ఆమె ముగ్గురు పిల్లలతో నివసిస్తూంటుంది. విజయ్ రేణుక కుటుంబానికి దగ్గరగా వచ్చి ఆమె పిల్లలతో అనుబంధాన్ని పెంచుకుంటాడు… ఆ తర్వాత ఏం జరిగిందన్నది మిగతా కథాంశం.
మెగాస్టార్ చిరంజీవి నటించిన “ఎస్.పి.పరశురాం” చిత్రం రవిరాజా పినిశెట్టి దర్శకత్వంలో 1994 లో విడుదలైన చిత్రం. ఇందులో చిరంజీవి, శ్రీదేవి ముఖ్యపాత్రలు పోషించారు. ఈ సినిమాను అల్లు అరవింద్, జి. కె రెడ్డి, ముకేష్ ఉదేషి నిర్మించారు. ఈ చిత్రానికి ఎం. ఎం. కీరవాణి సంగీతం అందించారు. తెలుగులో కథానాయికగా శ్రీదేవికిది చివరి సినిమా.
ఎస్.పి.పరశురాం విధినిర్వహణ పట్ల కఠినంగా వ్యవహరించే ఒక పోలీసు అధికారి. అతని తమ్ముడు నీలి చిత్రాల కేసులో పట్టు పడితే అతన్ని అరెస్టు చేయడానికి వెనుకాడడు. ఈ నేరంలో రాణి అనే చిన్న దొంగ కూడా బాధితురాలు అవుతుంది. ఆమె తప్పించుకుంటుంది కానీ సాక్షిగా ఉండటానికి ఒప్పుకుంటుంది. ఆమె సాక్షిగా ఉండటం వలన గూండాలు ఆమె మీద దాడి చేస్తారు. ఆ దాడిలో ఆమె చూపు కోల్పోతుంది. జరిగిన అన్యాయం పై హీరో ఏ విధంగా తిరగబడతారు అనేదే మిగతా కథాంశం…. నిర్ణయం, రౌడీ ఇన్స్పెక్టర్, సూపర్ పోలీస్, ఎస్పి పరశురాం.. లాంటి చిత్రాలతో ఈ నలుగురు స్టార్స్ బాక్స్ ఆఫీస్ వద్ద లాఠీ లేవనెత్తగా పోలీస్ గా ఒక్క బాలయ్యే లాఠీని ఝులిపించగలిగారు.
కోర్టు ఆదేశాలతో ‘మెగా’ నిర్ణయం తెలుగు చలనచిత్ర పరిశ్రమ (TFI) చరిత్రలో కీలకమైన పరిణామం చోటుచేసుకుంది. సినిమాలపై సోషల్ మీడియాలో…
ఈ దేశంలో అన్ని భాషల్లోనూ, అన్ని రాష్ట్రాల్లోనూ ఎన్నో పీఠాలు, మఠాలు, దేవస్థానాలు, ధార్మిక మండళ్ళూ, ట్రస్ట్ లు, ధార్మిక…
అద్భుత మంత్ర శక్తులతో, మంత్ర రహస్యాలతో, మంత్ర విశేషాలతో మరీ ముఖ్యంగా మహా బలాలకే మహా బలాన్నిచ్చే పరమాద్భుత నృసింహ…
భారత రూపాయి చరిత్రలో ఎన్నడూ లేని స్థాయిలో పతనమవుతోంది. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ రోజురోజుకు దిగజారుతూ ఆల్‌టైం…
చలికాలం వచ్చిందంటే చాలు.. చాలా మందికి ఒక విచిత్రమైన అనుభవం ఎదురవుతుంటుంది. కారు డోర్ తీస్తున్నా, కుర్చీలో కూర్చుంటున్నా, కనీసం…
నేటి ఉరుకుల పరుగుల జీవితంలో మానసిక ప్రశాంతతకు, శారీరక దృఢత్వానికి చాలామంది యోగాను ఆశ్రయిస్తున్నారు. అయితే, యోగా చేసేవారిని తరచుగా…