వైయస్ వివేకా హత్య కేసులో కొనసాగుతున్న విచారణ!

ఏపీ మాజీ మంత్రి వైయస్ వివేకా హత్యలో సీబీఐ విచారణ 69వ రోజు కొనసాగింది. అధికారులు రెండు బృందాలుగా పులివెందులలో విచారణ చేపట్టారు. తుమ్మలపల్లి కర్మాగారంలో పనిచేసే ఉద్యోగి ఉదయ్ కుమార్ రెడ్డితో పాటు ఆయన తండ్రి ప్రకాష్ రెడ్డిని అధికారులు ప్రశ్నించారు .

కాగా విచారణలో భాగంగా అధికారులు ఇద్దరు అనుమానితులను విచారించారు. సీబీఐ కస్టడీలో ఉన్న సునీల్​యాదవ్​తో పాటు అతని సమీప బంధువు భరత్​కుమార్​ యాదవ్​ను ప్రశ్నించారు. వివేకా కుమార్తె సునీత.. తనకు భద్రత కల్పించాలని ఎస్పీకి ఫిర్యాదు చేసిన నేపథ్యంలో పులివెందుల పోలీసులు వివేకా ఇంటి వద్ద పటిష్ట భద్రతను ఏర్పాటు చేశారు. అంతేకాక ఈనెల 10న పులివెందుల వివేకా ఇంటి వద్ద అనుమానాస్పదంగా తిరిగినా మణికంఠరెడ్డిని ఇవాళ పోలిసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం పలు విషయాలపై మణికంఠ రెడ్డిని ప్రశ్నించినట్లు తెలుస్తోంది. అనంతరం… మణికంఠ రెడ్డిపై బైండోవర్ కేసు నమోదైంది. .