దేశ రాజధాని ఢిల్లీలో హత్యలు, అత్యాచారాలకు అడ్డాగా ఉంటుంది. ఎప్పుడు చూసినా ఏదో ఒక క్రైం అక్కడ నుంచి వస్తూనే ఉంటుంది. ఇదిలా ఉండగా.. అక్కడ తాజాగా కాల్పులు కలకలం రేపాయి.
రోహిణి కోర్టులో గ్యాంగ్ వార్ జరిగింది. ఆ తుపాకుల శబ్దంతో అక్కడికి వచ్చిన వారంతో పరుగులు పెట్టారు.తుపాకుల శబ్ధాలకు కోర్టుకు వచ్చినవారంతా భయంతో పరుగులు తీశారు. ఈ మధ్యే ఓ వ్యాపారవేత్తను రూ.5కోట్లు ఇవ్వాలని బ్లాక్‌మెయిల్ చేయడంతో మోస్ట్ వాంటెడ్ గ్యాంగ్ స్టర్ జితేంద్ర అలియాస్ గోగిపై కేసు నమోదైంది.
ఈ కేసులో భాగంగా జితేందర్‌ను ఢిల్లీ స్పెషల్ సెల్ పోలీసులు ఇటీవలే అరెస్టు చేశారు. ప్రస్తుతం అతడు తిహార్ జైల్లో ఉన్నారు. తాజాగా విచారణలో భాగంగా అతడిని రోహిణి కోర్టుకు తీసుకువచ్చిన సమయంలో అతని ప్రత్యర్థులు ఆ కోర్ట్‌హాల్‌కు మారువేషాల్లో వచ్చారు. న్యాయవాది దుస్తుల్లో వచ్చిన దుండగులు.. న్యాయమూర్తి ముందే సుమారు 25 రౌండ్ల కాల్పులు జరిపారు. అక్కడ ఏం జరుగుతుందో ఎవరికీ అర్థం కాలేదు. కానీ అప్రమత్తంగా ఉన్న పోలీసులు .. మారువేషాల్లో వచ్చిన వారిలో ఇద్దరిని కాల్చేశారు.
ఆ కాలప్పుల్లో మొత్తం ముగ్గురు చనిపోయారు. అందులో ఒకరు జితేంద్ర కాగా.. ఇద్దరు జితేంద్రపై దాడి చేయడానికి వచ్చిన వారు. సినీ ఫక్కీలో షూటౌట్ జరిగినట్లు ఉన్నా.. అది గ్యాంగ్‌వార్ కాదని ఢిల్లీ పోలీసు కమిషనర్ తెలిపారు. ఇలా జితేంద్రను చంపడానికి వచ్చిన వారిలో ఒకరు మోస్ట్ వాంటెట్ క్రిమినల్.. అతడిని పట్టిస్తే 50 వేల రివార్డు ఇస్తామని అంతకు ముందే ప్రకటించినట్లు రాకేశ్ ఆస్తానా తెలిపారు.
అక్కడకు మారువేషాల్లో వచ్చిన వారిని టిల్లు గ్యాంగ్ వ్యక్తులుగా గుర్తించారు. ఆ కొద్దిసేపు ఆ ప్రాంతమంతా గందరగోల పరిస్థితి ఏర్పడింది. ఈ ఘటనను ప్రత్యక్షంగా చూసిన సత్యనారాయణ్ శర్మ అనే వ్యక్తి జడ్జి ముందు 25 నుంచి 30 రౌండ్ల కాల్పులు జరిగాయని తెలిపారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…