Fuel Price Hike : దేశంలో మరోసారి పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి. ధరలపెంపుకు ఒకరోజు గ్యాప్ ఇచ్చిన చమురు కంపెనీలు ఈరోజు మరోసారి పెట్రోల్, డీజిల్‌పై లీటరుకు 80 పైసలు పెంచేశారు. దీనితో గత నాలుగు రోజులలో పెట్రోల్, డీజిల్ ధరలు పెరగటం ఇది మూడోసారి.
తాజా పెంపుతో దేశ రాజధాని ఢిల్లీలో పెట్రోల్ ధర రూ.97.81, డీజిల్ ధర రూ.89.07కు చేరాయి. తెలంగాణ హైదరాబాద్‌లో లీటరు పెట్రోలుపై రూ. 90 పైసలు, డీజిల్‌పై 87 పైసల చొప్పున పెరిగాయి. దీంతో పెట్రోలు ధర రూ.111.91, డీజిల్ రూ.97.23కు చేరాయి. ఇక ఏపీలో లీటర్ పెట్రోల్ ధర రూ.112.76కి చేరింది. లీటర్ డీజిల్ ధర రూ.98.74కు చేరుకుంది.
ఇక తాజా పెంపుతో నాలుగు రోజుల్లోనే లీటరు పెట్రోల్, డీజిలు ధరలు రూ.2.40 చొప్పున పెరిగాయి. అంతర్జాతీయ మార్కెట్ లో ముడిచమురు ధరలు భారీగా పెరిగడంతో చమురు కంపెనీలు లీటరు డీజిలుపై రూ.13.1 నుంచి రూ.24.9 వరకు, పెట్రోలుపై రూ.10.6 నుంచి రూ.22.3 వరకు ఇలా ప్రతిరోజూ వడ్డించే అవకాశం ఉందని వ్యాపార వర్గాలు అంచనా వేస్తున్నాయి.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…