రాజమౌళి దర్శకత్వంలో పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కిన ఆర్ఆర్ఆర్ సినిమా ఎన్నో అంచనాల నడుమ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇప్పటికే ఓవర్సీస్ లో పలు చోట్ల షో లు పడ్డాయి. బెనిఫిట్ షోలు, ఫ్యాన్స్ షోలతో హైద్రాబాద్ మొత్తం ఆర్ఆర్ఆర్ మయం అయిపోయింది. ఇక ఈ సినిమా గురించి ట్విట్టర్‌లో సందడి మొదలైంది. అసలు రాజమౌలీ సినిమా అంటేనే రివ్యూలతో సంబంధం లేకుండా థియేటర్లకు పరిగెడతారు ప్రేక్షకులు.. అయితే ఇప్పటికే హిట్ ఫ్లాప్ తో సంబంధం లేకుండా ఏకంగా మూడు రోజుల వరకు టికెట్లు బుక్ అయ్యాయి. ఇక ఈ సినిమాని మొదటిరోజు చూడటం కోసం ప్రతిఒక్కరూ భావిస్తున్నారు.
సినిమా చూసిన వాళ్ల టాక్ ప్రకారం సినిమా ఫస్ట్ హాఫ్ చాలా బాగుందని చెబుతున్నారు. ఒక విజువల్ వండర్.. ఒక ఎమోషనల్ క్లాసిక్ అంటూ.. చెబుతున్నారు. ఇక ఈ సినిమాలో చరణ్ ఒక కోపదారి పాత్రలో కొంచెం నెగటివ్ షేడ్స్ లో కనిపిస్తారట. అయితే అతని పాత్రలో ఎమోషన్ అంతా సెకండ్ హాఫ్ లో తెలుస్తుందట. ఇక చరణ్ – ఎన్టీఆర్ ఇద్దరూ కలిసిన నటించిన సీన్స్ అద్భుతంగా తీర్చి దిద్దారట డైరెక్టర్ రాజమౌళీ. ఇక ఇంటర్వెల్ గురించి చెప్పడానికి మాటల్లెవని అంటున్నారు అభిమానులు. మొత్తంగా ఈ సినిమా ఒక విజువల్ ఫీస్ట్ అంటున్నారు అభిమానులు.
ఇక ఎన్టీఆర్ – చరణ్ ల ఇంట్రడక్షన్ సీన్లకు గూస్ బంప్స్ వస్తాయని చెబుతున్నారు. సెకండ్ హాఫ్ చాలా ఎమోషనల్ గా సాగుతుందని. ఇద్దరు హీరోలు కలిసి చేసే ఫైట్స్, యాక్షన్ సీక్వేన్సేస్ వేరే లెవల్ లో ఉన్నాయని అంటున్నారు. చివరగా క్లైమాక్స్ కి వచ్చేసరికి మాత్రం సినిమాలో ఏదో మిస్ అయిన ఫీలింగ్ వస్తోందట.. అజయ్ దేవగన్ కీలకమైన పాత్ర చాలా కీలకంగా ఉందట. ఆలియాభట్ పాత్రకి ఎక్కువ స్క్రీన్ స్పేస్ ఉండకపోయినా కనిపించినంత వరకూ అద్భుతంగా చేసిందట…
మొత్తమ్మీద ఈ చిత్రం ఒక విజువల్ వండర్.. ఒక ఎమోషనల్ క్లాసిక్.. ఒక యాక్షన్ ఫీస్ట్. చివరగా ఒక్క మాటలో ‘ఆర్ఆర్ఆర్’ అబ్బుర పరుస్తోందిని చెప్పుకొచ్చారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…