Gaddam Naveen : ఈటీవీ జబర్దస్త్ కామెడీ షో ద్వారా ఇండస్ట్రీ కి పరిచయమైనా వాళ్ళు ఎందరో అయితే ఆల్రెడీ ఇండస్ట్రీ లో ఉంటూ చిన్న చిన్న వేషాలు వేస్తున్న మంచి గుర్తింపు అందుకుని కెరీర్ లో ఎదిగినవారు ఉన్నారు. జబర్దస్త్ వల్ల అటు ఆర్థికంగా నిలదోక్కుకోవడమే కాకుండా సినిమాల్లో మంచి అవకాశాలను కూడా అందుకుంటున్నారు చాలా మంది కమెడియన్స్. అలా జబర్దస్త్ వచ్చి గుర్తింపు తెచ్చుకున్న నటుడు జబర్దస్త్ గడ్డం నవీన్. అంతకు ముందు సినిమాల్లో ఎన్నో పాత్రలు చేసిన రాని గుర్తింపు జబర్దస్త్ వల్ల బాగా వచ్చింది నవీన్ కి ఇక తన జబర్దస్త్ గురించి మల్లెమల సంస్థ గురించి ఆసక్తికర వాఖ్యలు చేశారు.
సుధీర్ మళ్ళీ వస్తాడు.. పక్కా….
జబర్దస్త్ నుండి గత కొంత కాలంగా వలసలు కొనసాగుతున్నాయి. చాలా మంది సీనియర్ కమెడియన్స్ జబర్దస్త్ వదిలి ఇతర ఛానెల్స్ కు వెళ్లిపోయారు. ఇక దీని గురించి గడ్డం నవీన్ మాట్లాడుతూ ఎవరి వ్యక్తిగత సమస్యల కారణంగా వాళ్ళు జబర్దస్త్ మానేశారు. అయితే మల్లెమల సంస్థ గురించి బయట విమర్శించడం తప్పు. నా వరకు మల్లెమల అన్నం పెట్టింది అనే కృతజ్ఞత ఉంది అంటూ చెప్పారు.
ఇక సుడిగాలి సుధీర్ ప్రస్తావన రాగా ఆయన మళ్ళీ జబర్దస్త్ లోకి వస్తారంటూ చెప్పారు. వ్యక్తిగత కారణాలతో వెళ్ళాడు మళ్ళీ ఖచ్చితంగా జబర్దస్త్ లోకి వస్తాడు రాసిపెట్టుకోండి అంటూ చెప్పాడు. ప్రస్తుతం మళ్ళీ సుధీర్ శ్రీ దేవి డ్రామా కంపెనీ, జబర్దస్త్ ల్లో కనిపిస్తూ సందడి చేస్తున్నాడు. అయితే గాలోడు సినిమా ప్రొమోషన్స్ కోసం జబర్దస్త్ వచ్చిన సుధీర్ మళ్ళీ జబర్దస్త్ లో కొనసాగుతాడో లేదో చూడాలి.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…