Galodu cinema actor Ravi Reddy : జబర్దస్త్ నుండి కామెడియన్ గా బాగా ఫేమస్ అయిన సుడిగాలి సుధీర్ ఆల్రడీ సినిమాల్లో హీరోగా చేస్తున్నాడు. అయితే ఇప్పటివరకు చేసిన సినిమాలు ఆశించినంతగా హిట్ కాలేదు. తాజాగా సుడిగాలి సుధీర్, సాఫ్ట్ వేర్ సుధీర్ సినిమా టీంతో మరోసారి చేసిన సినిమా గాలోడు. ఇక ఈ సినిమా ఇటీవల విడుదల అయి మంచి స్పందన అందుకుంది. హిట్ టాక్ తో నడిస్తున్న ఈ సినిమాలో హీరోయిన్ తండ్రి పాత్రలో నటించిన రవి రెడ్డి తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొని సినిమా విశేషాలను అలాగే సుధీర్ గురించి మాట్లాడాడు.
సినిమాకు అన్ని కోట్లు లాభాలు వచ్చాయి…
గాలోడు సినిమాలో హీరోయిన్ ఫాదర్ గా నటించిన రవి రెడ్డి గారు అంతకుముందు సాఫ్ట్ వేర్ సుధీర్ లో కూడా ఒక రోల్ లో నటించారు. ఇప్పటి వరకు ముప్పైకి పైగా సినిమాల్లో నటించిన ఆయన సాయి ధరమ్ తేజ్ ఇంటెలిజెంట్ లాంటి సినిమాల్లో నటించాడు. ఇక సుధీర్ గురించి మాట్లాడుతూ షూటింగ్ లో చాలా ఫ్రెండ్లీ గా ఉంటాడని అందరితో మాట్లాడుతూ హీరో అన్న గర్వం అసలు లేదంటూ చెప్పాడు.
ఇక ఈ సినిమాకు డిఓపి గా రామ్ ప్రసాద్ గారు కావడం వల్ల ఆయన ప్రతి విషయంలో చాలా జాగ్రత్త తీసుకుంటారు. సీన్స్ ఎక్కువ టేకులు తీసుకోలేదు అంటూ చెప్పారు. ఇక సుధీర్ మంచి నటుడు సింగల్ టేక్ యాక్టర్ అంటూ చెప్పారు. ఇక సినిమా బడ్జెట్ 8 కోట్లు కాగా అంతకు మించి వసూళ్లు వచ్చాయని ఇంకో వారం థియేటర్స్ లో ఉండి ఉంటే ఇంకా లాభాలు వచ్చేవని కాకపోతే కొత్త సినిమాలు రిలీజ్ అవడం వల్ల సినిమా చాలా థియేటర్లలో తీసేశారని రవిరెడ్డి ‘గాలోడు’ మూవీ విశేషాలను పంచుకున్నారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…