Nagachaitanya -Sobhita: టాలీవుడ్ ఇండస్ట్రీలో అక్కినేని వారసుడుగా పలు సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా గడుపుతున్న నాగచైతన్య సమంతకు విడాకులు ఇచ్చి పూర్తిగా తన దృష్టి సినిమాలపై పెట్టారు. ఈ క్రమంలోనే వరుస సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు.ఇకపోతే తాజాగా ఈయన వెంకట్ ప్రభు దర్శకత్వంలో కస్టడీ అనే సినిమాలో పోలీస్ ఆఫీసర్ పాత్రలో సందడి చేయనున్నారు. నాగచైతన్య పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా నుంచి నాగచైతన్య ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల చేశారు.
ఇకపోతే నాగచైతన్య పుట్టినరోజు సందర్భంగా ఈయనకు సంబంధించిన మరో వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. గతంలో నాగచైతన్య నటి శోభిత ధూళిపాళ్లతో రిలేషన్లో ఉన్నారంటూ వార్తలు వచ్చాయి. ఈ క్రమంలోనే వీరిద్దరూ సహజీవనం చేస్తున్నారంటూ పెద్ద ఎత్తున వార్తలు రావడంతో ఈ వార్తలను అక్కినేని అభిమానులు తిప్పుకొట్టారు. అదేవిధంగా ఈ వార్తలపై శోభిత స్పందించి మిడిల్ ఫింగర్స్ చూపించారు.
ఈ విధంగా శోభిత పరోక్షంగా తన గురించి వచ్చిన వార్తలకు కౌంటర్ ఇవ్వగా నాగచైతన్యకు ఇదే ప్రశ్న ఎదురవగా ఈయన మాత్రం నవ్వడం తప్ప నేనేం చేయలేను అంటూ ఒక చిన్న నవ్వు నవ్వారు. దీంతో వీరి రిలేషన్ గురించి అయోమయంలో అభిమానులు ఉండిపోయారు.
ఇకపోతే తాజాగా నాగచైతన్య నటి శోభితతో కలిసి ఫోటోలకు ఫోజులు ఇవ్వడంతో మరోసారి వీరి గురించి వార్తలు సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతున్నాయి. వీరిద్దరూ రిలేషన్ లో ఉన్నారని త్వరలోనే పెళ్లి కూడా చేసుకోబోతారని ఇదే విషయాన్ని అధికారకంగా ప్రకటించనున్నారు అంటూ వార్తలు వస్తున్నాయి.అయితే వీరిద్దరూ కలిసి ఎక్కడ ఈ ఫోటో దిగారు ఎక్కడ ఉన్నారు అనే విషయం మాత్రం తెలియాల్సి ఉంది. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…