ప్రస్తుతం బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ దుబాయ్‌లో ఉన్న సంగతి తెలిసిందే. ఐపీఎల్ 14వ సీజన్ మరియు టీ20 ప్రపంచకప్ నిర్వహణ కోసం గత వారం రోజులుగా మంతనాలు జరుపుతున్నాడు. అయితే తాజాగా ఇంస్టాగ్రామ్ లో దాదా పెట్టిన ఒక పోస్టుతో నెటిజన్ల ఆగ్రహం గురయ్యారు. దీంతో నెటిజన్ల ఆగ్రహాన్ని గ్రహించిన గంగూలీ వెంటనే ఆ పోస్టును తొలగించారు
విషయంలోకి వెళితే.. గంగూలీ శనివారం దుబాయ్ ఆటోడ్రోమ్‌ను సందర్శించి అక్కడ జరుగుతున్న కార్ రేసింగ్ లో పాల్గొన్నాడు. అయితే ఈ విషయాన్ని ఇంస్టాగ్రామ్ లో తన అభిమానులతో పంచుకున్నాడు. “రేస్ కారు నడిపాను..ఇందులోంచి విపరీతమైన హీట్ వస్తోంది” అంటూ తన ఫోటోతో పాటూ షేర్ చేసాడు. అయితే అభిమానులు మాత్రం ” ఈ కరోనా సమయంలో ఇలాంటి పోస్టులు పెట్టడం అవసరమా.? సమాజం కోసం ఏదైనా మంచి పని చేయొచ్చు కదా.. కరోనా ఉదృతంగా ఉన్న ఈ సమయంలో ఇటువంటి పనులు అవసరమా.. మొన్ననే కదా మీకు గుండెకు సంబంధించి సర్జరీ జరిగింది.. మీ ఆరోగ్యం కాపాడుకోవాల్సింది పోయి ఇలాంటి పనులు చేస్తారా” అంటూ ఘాటుగా స్పందించారు. దీంతో గంగూలీ తన పోస్టును వెంటనే డిలీట్ చేశాడు..
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…