Featured

గొంతు నొప్పి సమస్యతో బాధపడుతున్నారా… కొబ్బరి నూనెతో ఇలా చేయండి?

ప్రస్తుతం వాతావరణంలో పలు మార్పులు చోటు చేసుకోవడం వల్ల మనలో ఎన్నో రకాల అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. ఈ క్రమంలోనే చాలామంది వర్షాకాలంలో దగ్గు జలుబు వంటి ఇన్ఫెక్షన్ల బారిన పడతారు. ముఖ్యంగా అధికంగా దగ్గు రావడం వల్ల గొంతులో నొప్పిగా ఉంటుంది.ఈ గొంతు నొప్పి కారణంగా మాట్లాడటానికి లేదా ఏదైనా తినడానికి ఎంతో ఇబ్బంది పడుతుంటారు. మరి ఈ విధంగా గొంతు నొప్పి సమస్యతో బాధపడేవారు ఈ కొబ్బరినూనె చిట్కాలు పాటించి తొందరగా గొంతు నొప్పి నుంచి ఉపశమనం పొందండి.

కొబ్బరినూనె ఎంతో సహజసిద్ధమైనది. ఈ కొబ్బరి నూనెలో అధిక మొత్తంలో సంతృప్త కొవ్వు ఆమ్లాలు, పాలీఅన్‌శాచురేటెడ్ కొవ్వు ఆమ్లాలు, పాలీఫెనాల్స్, విటమిన్ ఇ, విటమిన్ కె ఆమ్లాలు పాలీఫెనాల్స్, ఉంటాయి. ఇవి మన ఆరోగ్యాన్ని కాపాడటానికి కీలకపాత్ర పోషిస్తాయి. అందుకోసమే వంటలలో కూడా కొబ్బరి నూనెను ఉపయోగించడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చని నిపుణులు చెబుతుంటారు.

ముఖ్యంగా గొంతు నొప్పి సమస్యతో బాధపడేవారు రెండు నుంచి మూడు టీ స్పూన్ల కొబ్బరి నూనెను నోటిలో వేసుకొని నెమ్మదిగా గార్గ్లింగ్ చేయాలి. అయితే కొబ్బరి నూనెను మనం మింగకూడదు. ఇలా నెమ్మదిగా
గార్గ్లింగ్ చేయటం వల్ల నోటిలో ఉన్న బ్యాక్టీరియా తొలగిపోయి మనకు గొంతు నొప్పి నుంచి ఉపశమనం కలుగుతుంది.

ఈ విధంగా గార్గ్లింగ్ చేయటం వల్ల గొంతులో ఉన్నటువంటి బ్యాక్టీరియా తొలగిపోయి గొంతు వాపు నొప్పి నుంచి ఉపశమనం కలిగిస్తుంది. సాధారణంగా గొంతు నొప్పితో బాధపడేవారు గోరువెచ్చని నీటిలో కాస్త ఉప్పు వేసుకుని గార్గ్లింగ్ చేస్తారు. అలా చేసినప్పటికీ గొంతు నొప్పి తగ్గకపోతే కొబ్బరి నూనెను ఉపయోగించాలి. కొబ్బరి నూనెతో కూడా గొంతు నొప్పి సమస్య తగ్గకపోతే ఒకసారి వైద్యుని సంప్రదించి సరైన చికిత్స తీసుకోవడం ఎంతో ఉత్తమం.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago