ప్రస్తుతం వాతావరణంలో పలు మార్పులు చోటు చేసుకోవడం వల్ల మనలో ఎన్నో రకాల అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. ఈ క్రమంలోనే చాలామంది వర్షాకాలంలో దగ్గు జలుబు వంటి ఇన్ఫెక్షన్ల బారిన పడతారు. ముఖ్యంగా అధికంగా దగ్గు రావడం వల్ల గొంతులో నొప్పిగా ఉంటుంది.ఈ గొంతు నొప్పి కారణంగా మాట్లాడటానికి లేదా ఏదైనా తినడానికి ఎంతో ఇబ్బంది పడుతుంటారు. మరి ఈ విధంగా గొంతు నొప్పి సమస్యతో బాధపడేవారు ఈ కొబ్బరినూనె చిట్కాలు పాటించి తొందరగా గొంతు నొప్పి నుంచి ఉపశమనం పొందండి.

కొబ్బరినూనె ఎంతో సహజసిద్ధమైనది. ఈ కొబ్బరి నూనెలో అధిక మొత్తంలో సంతృప్త కొవ్వు ఆమ్లాలు, పాలీఅన్‌శాచురేటెడ్ కొవ్వు ఆమ్లాలు, పాలీఫెనాల్స్, విటమిన్ ఇ, విటమిన్ కె ఆమ్లాలు పాలీఫెనాల్స్, ఉంటాయి. ఇవి మన ఆరోగ్యాన్ని కాపాడటానికి కీలకపాత్ర పోషిస్తాయి. అందుకోసమే వంటలలో కూడా కొబ్బరి నూనెను ఉపయోగించడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చని నిపుణులు చెబుతుంటారు.
ముఖ్యంగా గొంతు నొప్పి సమస్యతో బాధపడేవారు రెండు నుంచి మూడు టీ స్పూన్ల కొబ్బరి నూనెను నోటిలో వేసుకొని నెమ్మదిగా గార్గ్లింగ్ చేయాలి. అయితే కొబ్బరి నూనెను మనం మింగకూడదు. ఇలా నెమ్మదిగా
గార్గ్లింగ్ చేయటం వల్ల నోటిలో ఉన్న బ్యాక్టీరియా తొలగిపోయి మనకు గొంతు నొప్పి నుంచి ఉపశమనం కలుగుతుంది.
ఈ విధంగా గార్గ్లింగ్ చేయటం వల్ల గొంతులో ఉన్నటువంటి బ్యాక్టీరియా తొలగిపోయి గొంతు వాపు నొప్పి నుంచి ఉపశమనం కలిగిస్తుంది. సాధారణంగా గొంతు నొప్పితో బాధపడేవారు గోరువెచ్చని నీటిలో కాస్త ఉప్పు వేసుకుని గార్గ్లింగ్ చేస్తారు. అలా చేసినప్పటికీ గొంతు నొప్పి తగ్గకపోతే కొబ్బరి నూనెను ఉపయోగించాలి. కొబ్బరి నూనెతో కూడా గొంతు నొప్పి సమస్య తగ్గకపోతే ఒకసారి వైద్యుని సంప్రదించి సరైన చికిత్స తీసుకోవడం ఎంతో ఉత్తమం.


































