Gauri Khan : బాలీవుడ్ లో నెపోటిజంను ఎంతగా విమర్శిస్తున్నా తమ అభిమానం హీరోల పిల్లలను మళ్ళీ వెండి తెరమీద చూడాలని కోరుకునే ప్రేక్షకులు లేకపోలేదు. బాలీవుడ్ కీ బాద్ షా షారుఖ్ ఖాన్ కొడుకు ఆర్యన్, ఎపుడు హీరోగా వస్తాడంటూ ఎదురుచూస్తున్నారు బాద్ షా ఫ్యాన్స్. ఇక కూతురు సుహానా కూడా సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉంటూ ఎప్పటికప్పుడు హీరోయిన్ గా ఎంట్రీ ఇస్తుందా అన్నట్లుగా ఫోటో షూట్లతో కుర్రకారు మతి పోగొడుతోంది. ఇక సుహానా, ఆర్యన్ సినిమాల్లోకి వస్తారంటూ అటు మీడియా కూడా బాగానే వార్తలు అప్పుడుప్పడు రాస్తూనే ఉన్నారు.
కూతురికి డేటింగ్ అడ్వైస్ ఇచ్చిన గౌరీ ఖాన్…
షారుఖ్ ఖాన్ భార్య గౌరీ ఖాన్ కూడా బాగా ఫేమస్, సినిమాల్లో కనిపించకపోయినా ఇంటీరియర్ డిజైనర్ గా తనకు మంచి పేరు ఉంది. తాజాగా కూతురికి డేటింగ్ గురించి అడ్వైస్ ఇచ్చి అందరినీ ఆశ్చర్యపరిచింది గౌరీ ఖాన్. కాఫీ విత్ కరణ్ షో లో పాల్గొన్న గౌరీ ఖాన్ కుటుంబం తన పిల్లల గురించి మాట్లాడుతూ సుహానా కనుక డేటింగ్ వెళితే ఒకేసారి ఇద్దరితో వెళ్లొద్దని సలహా ఇస్తాను అంటూ నిర్మొహమాటంగా చెప్పేసింది. ఇక షారుఖ్ తో తన పెళ్లి గురించి మాట్లాడుతూ అదొక వింత అనుభవం ఏవేవో జరిగాయి అంటూ చెప్పింది.
షారుఖ్ కాజోల్ నటించిన ‘దిల్ వాలే దూలహానియ లే జాయేంగే’ సినిమా కథలా అనిపిస్తుంది అంటూ చెప్పింది. ఇటీవలే గౌరీ ఖాన్ ఫాబులెస్ వైఫ్స్ అనే ఓటీటీ ప్రోగ్రామ్ లో కూడా సందడి చేసారు. ఇప్పటికే రెండు ఎపిసోడ్లు పూర్తి అయిన ఈ షోలో బాలీవుడ్ స్టార్ హీరోల భార్యల జీవన సరళి ఎలా ఉంటుందో చూపిస్తారు. నెట్ ఫ్లిక్స్ లో వస్తోన్న ఈ షోలో గౌరీ రెండు ఎపిసోడ్స్ లో అపుడపుడు కనిపించి సందడి చేసారు.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…