Categories: FeaturedMovie News

Ntr : బాలకృష్ణ హీరోయిన్ కోరిక నెరవేర్చిన తారక్… ఆ సినిమా వెనుక అంత కథ ఉందా..?

Ntr : నందమూరి నట వారసుడుగా తెలుగు చలన చిత్ర పరిశ్రమకు పరిచయం అయిన బాలకృష్ణ తండ్రికి తగ్గ తనయుడిలా పేరు సంపాదించుకున్నాడు. కెరీర్ మొదలు పెట్టినప్పటినుండి ఇప్పటి వరకు 100 కి పైగా చిత్రాలలో నటించి అభిమానులను అలరిస్తున్నాడు. ఇప్పటి వరకు ఎన్నో సూపర్ హిట్ చిత్రాలలో నటించిన బాలకృష్ణ ఎంతో మంది హీరోయిన్లతో కలసి నటించాడు. అయితే అప్పట్లో భానుప్రియ‌, సుహాసిని, విజ‌య‌శాంతి, రాధ‌, ర‌జ‌నీ వంటి వారు ఆయనకు సరైన జోడిగా ఉన్నారు. ఈ హీరోయిన్లతో బాలకృష్ణ చాలా సినిమాలలో నటించారు. అయితే హీరోయిన్ రాధ తో మాత్రం కేవలం నాలుగు సినిమాలలోనే నటించారు. అయితే వీరిద్దరి మధ్య మంచి స్నేహం ఉండేదట.

హీరోయిన్ రాధ కోరిక మేరకే ఆ సినిమా…

రాధ కేర‌ళ‌కు చెందిన వ్య‌క్తిని పెళ్లి చేసుకొని సినిమాలకు దూరం అయ్యింది. రాధకు ఇద్దరు కుమార్తెలు ఒక కుమారుడు. ఇద్దరు కూతుర్ల గురించి మనకు తెలిసిందే. కార్తీక, తులసి ఇద్దరూ హీరోయిన్లుగా పరిచయం అయ్యారు. వీరిద్దరినీ స్టార్ హీరోయిన్లు చేసేందుకు చాలా కష్టపడ్డారట. తులసి, మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన ‘కడలి’ సినిమా చేసినప్పటికీ తరువాత కనిపించలేదు. ఇక కార్తీక కొన్ని సినిమాలు చేసినప్పటికీ తెలుగులో ‘రంగం’ సినిమాగా వచ్చిన తమిళ్ సినిమా ‘కో’ మాత్రమే తన కెరీర్లో మంచి విజయం.

అయితే కార్తీక ను మంచి హేరోయిన్ గా నిలబెట్టాలని జూనియర్ ఎన్టీఆర్ ను తన సినిమాలో అవకాశం ఇవ్వమని డైరెక్ట్ గా అడిగిందట. అందుకు తారక్ కూడా కాదనకుండా ‘దమ్ము’ సినిమాలో హీరోయిన్ గా రికమెండ్ చేశారట. కాకపోతే ఆ సినిమా ఆశించిన విజయం సాధించలేదు. అందులోనూ సినిమా సరిగా ఆడకపోవడానికి అందులోని హీరోయిన్లు అయిన కార్తీక, త్రిష లు కూడా కారణంగా నిలిచారు. పైగా కార్తీక ఎక్స్ప్రెషన్స్ సరిగా లేవని కామెంట్లు కూడా వచ్చాయి. ఆ తరువాత కార్తీక కు సినిమా అవకాశాలు రాలేదు. సిస్టర్ రోల్ చేసినా ఎందుకోమరి ప్రేక్షకులు పట్టించుకోలేదు.

Bhargavi

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…

1 week ago

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

3 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

3 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

3 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

3 months ago