Categories: FeaturedMovie News

Kota Srinivasa Rao : ఎన్టీఆర్ వేషం వేయడం వల్ల బాలకృష్ణ కు కోపం వచ్చింది : కోటా శ్రీనివాసరావు

Kota Srinivasa Rao : విలన్ గా, కామెడీ విలన్ గా అటు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా సుమారు 750 సినిమాల్లో నటించిన విలక్షణ నటుడు కోటా శ్రీనివాసరావు గారు తెలియని తెలుగు ప్రేక్షకుడు ఉండడు. బాబు మోహన్ కోటా గారి కాంబినేషన్ అంటే ఆ రోజుల్లో సినిమా కు మినిమమ్ గ్యారెంటీ అనేంతలా వారి పాత్రలు ఉండేవి, కామెడీ పండేది. ఇక సీరియస్ విలన్ గా కూడా రాణించిన కోటా గారు సినిమాల్లో నటిస్తూనే రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. ఎమ్మెల్యే గా పనిచేసారు. ఇక ఇపుడు వృధాప్య సమస్యలతో సినిమాలలో పెద్దగా కనిపించని కోటా గారు ఇండస్ట్రీ గురించి, ఇప్పటి తరం నటుల గురించి ఆయన అభిప్రాయాలను, చేదు అనుభవాలను పలు ఇంటర్వ్యూల్లో పంచుకున్నారు.

బాలకృష్ణ నా ముఖం మీద ఉమ్మేశాడు…

ఎన్టీఆర్ లాగా ఒక సినిమాలో వేషం వేసినందుకు ఆయన ఎదుర్కొన్న సంఘటనలను కోటా ఇంటర్వ్యూల్లో పంచుకున్నారు. ఇంకా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన కొత్తలో కృష్ణ, విజయనిర్మల గారు తీసిన సినిమా ‘మండలాదీశుడు’ సినిమాలో ఎన్టీఆర్ గారి పాత్ర చేయమని ఆఫర్ వస్తే అప్పటికే బ్యాంకు ఉద్యోగంలో ఉన్న నేను అటు సినిమా ఇటు బ్యాంకు అన్నట్టుగా ఉన్నాను. సరే ఈ పాత్ర చేస్తే.. అయితే ఇండస్ట్రీలో ఉండిపోతా లేదంటే నా బ్యాంకు ఉద్యోగం నాకు ఉంది అనుకుని ఆ సినిమాలో చేశాను. ఒకసారి సినిమా విడుదలయ్యాక కూతురిని చూడటానికి విజయవాడ వెళ్లగా అప్పుడే ఎన్టీఆర్ గారు ఏదో సీఎం హోదాలో పని మీద అక్కడికి రావడంతో రైల్వే స్టేషన్ అంతా జనంతో ఉంది. ఆ సమయంలో నన్ను ఎన్టీఆర్ అభిమానులు వెంబడించి కొట్టారు.

అయినా ఆ సమయంలో సినిమా అవకాశాలు తగ్గలేదు. కృష్ణ గారి సినిమాల్లో అవకాశాలు ఉండేవి. ఇక రాజమండ్రి షూటింగ్ కోసం వెళితే అక్కడ బాలకృష్ణ ఏదో షూటింగ్ కోసం వచ్చాడు. నేను లిప్ట్ కోసం నిలబడి ఉంటే పరుచూరి బ్రదర్స్ పక్కకి పో అంటూ సైగ చేసారు నాకు అర్థం కాలేదు. ఇక బాలకృష్ణ ఎదురు వచ్చాడు, నేను నమస్కారం పెడితే ఆయన నా మోహం మీద ఉమ్మేశాడు. వాళ్ళ నాన్న మీద సినిమా తీసినందుకు కోపం రావడం సహజమే కదా కానీ ఆ పాత్ర చేసినందుకు నేను బాధపడలేదు. ఇక వాళ్ళ అభిమానులు నన్ను వెంబడించి కొట్టి అన్నీ చేసినా సరేలే అనుకుని వదిలేసాను అంటూ అప్పటి చేదు అనుభవాలను చెప్పారు.

Bhargavi

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…

4 days ago

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

3 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

3 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

3 months ago