Geethakrishna about Liger : సినిమా సెలబ్రిటీల గురించి సినిమాల గురించి తన కామెంట్స్ ద్వారా సోషల్ మీడియాలో పాపులర్ అయిన డైరెక్టర్ గీతా కృష్ణ వైరల్ అవుతున్న ఏ విషయాన్ని వదలడం లేదు. సింగర్ శ్రావణ భార్గవి నుండి, నేడు లైగర్ మూవీ ట్రైలర్ వరకు అన్ని విషయాలు నాకు తెలుసు అన్న రేంజ్ లో కామెంట్స్ చేస్తున్నారు. తాజాగా లైగర్ సినిమా ట్రైలర్ విడుదలయి ప్రేక్షకులనుండి మంచి స్పందన తెచ్చుకుంది. కానీ డైరెక్టర్ గీతా కృష్ణ మాత్రం ఆ సినిమాకు రివ్యూ కాకుండా ఏకంగా ట్రైలర్ కి రివ్యూ ఇచ్చేసాడు.
పరమ అసహ్యంగా ఉంది…
లైగర్ సినిమా ట్రైలర్ ను వర్ణిస్తూ గీతా కృష్ణ నేను ట్రైలర్ చూసి కింద కామెంట్స్ చదివాను అందులో ఒక వ్యక్తి సుధీర్ఘ కామెంట్ పెట్టాడు అది నాను ఆకట్టుకుంది అంటూ చెప్పాడు. సినిమా కోసం విజయ్ దేవరకొండ పూర్తిగా మారిపోయాడు. గీతా గోవిందం వంటి సినిమాల్లో పక్కింటి కుర్రాడిలా ఉండేవాడు ఈ సినిమాతో కండలు పెంచుకుని మారిపోయాడు. కానీ న్యూడ్ గా చేసిన ఆ పిక్ పరమ అసహ్యంగా ఉంది. పూరీ జగన్నాథ్ సినిమాలు హాలీవుడ్ సినిమాల కాపీలు అంటూ కామెంట్స్ చేసాడు గీతా కృష్ణ. ఒక్కో సినిమాలో ఒక్కో పాత్రను తీసుకుని సాంబార్ కలిపాడు. పూరీ కి కర్రీ ఉంటుంది ఇతను మాత్రం సాంబార్ కలిపాడు అంటూ మాట్లాడాడు.
శంకర్ సినిమాలో స్లమ్ క్యారెక్టర్ ను రమ్య కృష్ణ పాత్రలా డిజైన్ చేసుకున్నాడు. ఇక హీరోకి నత్తి ఉన్నట్లు చూపడం ఇక విజయ్ టైసన్ కి శిష్యుడు అవుతాడేమో మిలియన్ డాలర్స్ బేబీ సినిమా ను కొంచెం కాపీ చేసినట్లు ఉంది. అన్ని సినిమాల్లో అది కొంచెం ఇది కొంచెం తీసుకొని పూరీ సాంబార్ చేసాడు. ఇక మైక్ టైసన్ ఇపుడు ఎంతమందికి తెలుసు, బాలీవుడ్ కోసం టైసన్ ను తీసుకున్నట్లు ఉంది అంటూ ఘాటు వాఖ్యలు చేసాడు గీతా కృష్ణ.
భారత రూపాయి చరిత్రలో ఎన్నడూ లేని స్థాయిలో పతనమవుతోంది. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ రోజురోజుకు దిగజారుతూ ఆల్‌టైం…
చలికాలం వచ్చిందంటే చాలు.. చాలా మందికి ఒక విచిత్రమైన అనుభవం ఎదురవుతుంటుంది. కారు డోర్ తీస్తున్నా, కుర్చీలో కూర్చుంటున్నా, కనీసం…
నేటి ఉరుకుల పరుగుల జీవితంలో మానసిక ప్రశాంతతకు, శారీరక దృఢత్వానికి చాలామంది యోగాను ఆశ్రయిస్తున్నారు. అయితే, యోగా చేసేవారిని తరచుగా…
చేపలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయనడంలో సందేహం లేదు. అయితే, చేపలను ఏ ఆహారాలతో కలిపి తింటున్నాం అన్నదే అసలు…
కేంద్రంలోని మోదీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయానికి సిద్ధమవుతోంది. ఇప్పటివరకు అమలులో ఉన్న **మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ…
ప్రపంచం అంతా సోషల్ మీడియాకు బానిసైపోతున్న వేళ… ఆస్ట్రేలియా ఒక చారిత్రక నిర్ణయం తీసుకుంది. డిసెంబర్ 10 నుంచి అక్కడ…