Geethanjali Movie : అక్కినేని నాగేశ్వరరావు నట వారసుడిగా తెలుగు సినిమా రంగానికి పరిచయం అయ్యాడు నాగార్జున. 1986లో వచ్చిన ‘విక్రమ్’ సినిమా ద్వారా హీరోగా పరిచయం అయిన నాగార్జున సినీ ప్రయాణంలో చాలా సినిమాలు చేశాడు. అందులో ఎప్పటికీ నిలిచిపోయే సినిమాలలో ‘గీతాంజలి’ సినిమా ఒకటి. ఒక రొమాంటిక్ ప్రేమకథ తో వచ్చిన గీతాంజలి సినిమా నాగార్జున కెరీర్లో ఒక క్లాసిక్ గా నిలిచిపోయింది. ఈ సినిమా మంచి విజయం సాధించడంతో పాటు నటుడుగా నాగార్జునకు మంచి గుర్తింపు తెచ్చి పెట్టింది.
పెళ్లికి వచ్చిన అమ్మాయినే హీరోయిన్ గా…
1989 ముందు వరకు గీతాంజలి అనగానే రవీంద్రనాథ్ ఠాగూర్ గీతాంజలి అందరికీ గుర్తొచ్చేది. కానీ గీతాంజలి సినిమా వచ్చిన తరువాత తెలుగు సినిమా అభిమానులకు మాత్రం గీతాంజలి అనగానే టక్కున నాగార్జున సినిమానే మొదట గుర్తొస్తుంది. అంతలా అభిమానుల మనసు దోచుకుంది. అంతవరకూ మాస్ హీరోగా ఉన్న నాగార్జునను మణిరత్నం ఈ సినిమాతో టాలీవుడ్ మన్మధుడిగా చేసాడు. మొదట ‘అగ్ని నక్షత్రం’ అనే తమిళ్ సినిమాను రీమేక్ చేయాలని నిర్మాతలు భావిస్తే మణిరత్నం ఒక కొత్త కథను సినిమాగా తీయాలని ఒప్పించి మొదలుపెట్టారట. మణిరత్నం గీతాంజలి కథను నాగార్జునకు చెప్పగానే వెంటనే ఆయన కూడా ఒప్పేసుకున్నారట.
అయితే ఈ సినిమాకు హీరోయిన్ మాత్రం కొత్త అమ్మాయిని పెట్టాలని మణిరత్నం భావించారట. కానీ వెంటనే మణిరత్నం వివాహం సుహాసినితో జరగడం, ఆ పనుల్లో బిజీ గా ఉన్నారట. అయితే వీరి పెళ్ళికి క్రికెటర్ శ్రీకాంత్ కుటుంబ సమేతంగా హాజరు అవ్వడం వారితో పాటు శ్రీకాంత్ చెల్లెలు స్నేహితురాలు గిరిజ కూడా రావడం జరిగిందట. అపుడు ఆ అమ్మాయిని గమనించిన మణిరత్నం వివాహం తరువాత ఆ అమ్మాయి గురించి అడుగగా శ్రీకాంత్ తను, నా చెల్లి స్నేహితురాలు అమెరికా అమ్మాయి ఇక్కడికి అపుడప్పుడు వస్తుంది అని చెప్పడంతో తనను ఒప్పించి ఆ సినిమాలో హీరోయిన్ గా పెట్టారట. ఇలా పెళ్లి చూడటానికి వచ్చిన అమ్మాయిని సినిమాలో హీరోయిన్ గా పెట్టేసారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…