Featured

Getup Srinu: ఏడుకొండలు ఆరోపణలపై గట్టి కౌంటర్… బిల్డప్ బాబాయ్ క్యారెక్టర్ కు స్ఫూర్తి ఆయనే : గెటప్ శీను

Getup Srinu: ఇటీవల మొదలైన జబర్దస్త్ షో వివాదం గురించి అందరికి తెలిసిందే. కిరాక్ ఆర్పీ మొదలు పెట్టిన ఈ వివాదం రోజుకు ఒకరి కౌంటర్లతో రసవత్తరంగా సాగుతోంది. మొదట జబర్దస్త్‌ షో వాళ్లు ఆర్టిస్ట్‌లను బానిసలుగా చూస్తారు, తిండి కూడా సరిగా పెట్టరు అంటూ ఆరోపణలు చేసి వివాదాన్ని మొదలుపెట్టాడు ఆర్పీ. ఆతరువాత ఆర్పీ చేసిన ఆరోపణలు అన్ని అబద్దాలే అని కౌంటర్ ఇచ్చారు హైపర్ ఆది, ఆటో రామ్ ప్రసాద్. ఇక ఇపుడు తాజాగా ఇంతకు ముందు జబర్దస్త్ ప్రోగ్రాంకి ప్రొడక్షన్ మేనేజర్ గా పని చేసిన ఏడుకొండలు స్పందించారు.

కిరాక్‌ ఆర్పీకి కౌంటర్ ఇచ్చిన ఏడుకొండలు ఒక రేంజ్‌లో కడిగి పారేశాడు. అంతేకాకుండా ఆర్పీతో పాటు జబర్దస్త్ కాదని వేరే ఛానల్స్ కు వెళ్లిన సుడిగాలి సుధీర్, గెటప్ శీనులపై కూడా ఆరోపణలు చేశాడు. వెళ్లిపోయిన వారందరు తిరిగి మర్యాదగా జబర్దస్త్‌కి రావాలని లేకపోతే అందరి గురించి బయటపెడతానంటూ హెచ్చరించాడు కూడా. ఇక ఏడుకొండలు, తాను అప్పట్లో సుధీర్, గెటప్ శీను, ఆటో రాంప్రసాద్‌తో పాటు ఇంకా మిగిలిన కమెడియన్లకు కూడా ఒక్కొక్కరికి పది లక్షలు చొప్పున ఇప్పించానని చెప్పాడు. గెటప్ శీను కార్ కొనుక్కోవాలి రెమ్యూనరేషన్ పెంచమని అడిగితే నా కారు ఇచ్చేసానని కూడా చెప్పాడు. ఇపుడు ఈ వ్యాఖ్యలపై గెటప్ శీను స్పందించారు.

బిల్డప్ బాబాయ్ అంటూ…

ఇపుడు గెటప్ శీను ఇన్‌డైరెక్ట్‌గా ఏడుకొండలపై స్పందిస్తూ స్ట్రాంగ్‌ కౌంటర్‌ ఇచ్చాడు. ‘నేను అమ్మాను అని చెప్పడానికి.. ఇచ్చాను అని చెప్పడానికి చాలా వ్యత్యాసం ఉందయ్యా.. కెమెరా ఉంటే సాలు సృహ లేకపోతే ఎలాయ్యా’ అన్న వ్యాఖ్యలతో పాటు కొండలు ఉన్నట్టుగా ఉన్న ఒక ఎమోజీని కూడా షేర్ చేశాడు. దీంతో ఇది ఏడుకొండలకి కౌంటర్ అని అందరికి అర్థమైపోయింది. కారు అమ్మితే తాను కొనుక్కున్నానని, కారు ఇచ్చేశాను అనడానికి, అమ్మాను అని చెప్పడానికి చాలా తేడా ఉందని గెటప్ శీను చెప్పకనే చెప్పాడు.

అంతేకాకుండా సోషల్ మీడియా వేదికగా డైరెక్టుగా కూడా ఏడికొండలకు కౌంటర్ ఇచ్చాడు. ఏకంగా ఏడుకొండలు ఫొటోని ఒక్కటి పెట్టి.. ‘నేను స్కిట్లో చేసిన బిల్డప్ బాబాయ్ క్యారెక్టర్‌కి ఇతనే స్పూర్తి’ అంటూ గట్టి కౌంటర్ ఇచ్చాడు. కొంతమందికి డబ్బులు ఇచ్చాను, శీనుకి కారు ఇచ్చాను అని చెప్పడంతో ఏడుకొండలను బిల్డప్ బాబాయ్ తో పోల్చి కౌంటర్ ఇచ్చాడు గెటప్ శీను.

Bhargavi

Recent Posts

నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. ఉచిత బ్యాంక్ కోచింగ్ ప్రారంభం

తెలంగాణలో నిరుద్యోగ యువతకు ఊరటనిచ్చే నిర్ణయం వెలువడింది. తెలంగాణ గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో బ్యాంకింగ్ పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థులకు…

4 hours ago

ప్రభాస్, రవితేజతో హిట్స్.. కానీ కెరీర్‌ను వదిలేసిన హీరోయిన్

టాలీవుడ్‌లో తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్‌గా గుర్తింపు పొందిన రిచా గంగోపాధ్యాయ్ సినీ ప్రయాణం ఇప్పటికీ ఆసక్తికర చర్చగా నిలుస్తోంది.…

4 hours ago

నాగార్జున నమ్మకం లేకపోతే ఆర్జీవీ కెరీర్ ముగిసేది: జేడీ

టాలీవుడ్‌లో క్లాసిక్‌గా నిలిచిన ‘శివ’ సినిమా గురించి మరో ఆసక్తికర విషయాన్ని నటుడు జేడీ చక్రవర్తి వెల్లడించారు. ప్రస్తుతం తన…

4 hours ago

బాల్య వివాహం ఆపాలని వెళ్లి.. తప్పు బాలికను తీసుకెళ్లిన అధికారులు

తెలంగాణలోని గద్వాల జిల్లాలో చోటుచేసుకున్న ఓ ఘటన అధికారుల నిర్లక్ష్యంపై తీవ్ర విమర్శలకు దారి తీసింది. బాల్య వివాహాన్ని అడ్డుకోవడానికి…

4 hours ago

‘టాక్సిక్’లో కొత్త కోణం.. దర్శకురాలిపై యశ్ ప్రశంసలు

కన్నడ స్టార్ హీరో యశ్ నటిస్తున్న ‘టాక్సిక్’ సినిమా విడుదలకు ముందు నుంచే సినీ వర్గాల్లో భారీ చర్చకు దారి…

4 hours ago

కేసీఆర్‌కు సవాల్.. కవిత కొత్త పార్టీ ప్రకటన

తెలంగాణ రాజకీయాల్లో కొత్త చర్చకు దారి తీసే పరిణామం చోటుచేసుకుంది. బీఆర్ఎస్‌కు దూరమైన కల్వకుంట్ల కవిత, తన రాజకీయ ప్రయాణాన్ని…

4 hours ago