Categories: FeaturedMovie News

Naga Chaithanya : ఆ అమ్మాయి హృదయాన్ని ముక్కలు చేసి వెళ్ళిపోయింది : నాగ చైతన్య

Naga Chaithanya : నాగ చైతన్య అక్కినేని వారసుడిగా జోష్ సినిమాతో కెరీర్ ని ప్రారంభించాడు. ‘ఏం మాయ చేసావే’ సినిమా ద్వారా మంచి విజయాన్ని అందుకున్నాడు. ఏం మాయ చేసావే సినిమా నుంచి పరిచయం అయిన సమంత, నాగ చైతన్య 2017 లో వివాహం చేసుకొని 2021 లో విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే. అయితే ప్రస్తుతం ఇద్దరు ఎవరి కెరీర్ లో వారు బిజీగా వున్నారు. నాగచైతన్య హీరో గా వస్తున్న ‘థాంక్ యూ’ సినిమా జులై 22 నా ప్రేక్షకులకు ముందుకు రాబోతోంది. విడుదల సమయం దగ్గర ఉండటం తో ప్రమోషన్ కార్యక్రమాలు జోరుగా జరుగుతున్నాయి. ఈ క్రమంలో నాగ చైతన్య చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.

ఆ అమ్మాయిని ప్రేమించా.. హృదయం ముక్కలు చేసింది…

‘థాంక్ యూ’ సినిమాను దిల్ రాజు నిర్మిస్తుండగా ఈ చిత్రంలో రాశీ ఖన్నా, అవికాగోర్, మాళవిక నాయర్ నాగ చైతన్య సరసన హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇప్పటికే సినిమా నుండి విడుదల అయిన సాంగ్స్, టీజర్, ట్రైలర్కు ఆడియన్స్ నుంచి మంచి స్పందన రావడంతో అంచనాలు పెరిగిపోయాయి. అయితే నాగచైతన్య, రాశి ఖన్నా సినిమా ప్రమోషన్లలో భాగంగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ సినిమా లో నటించినదుకు కారణం గురించి ఇద్దరినీ అడుగగా… స్క్రిప్ట్ వినగానే తనలో ఒక ఫీలింగ్ వచ్చిందని.. అంతే కాకుండా తన జీవితంతలో స్పెషల్ పర్సన్స్కు థ్యాంక్స్ చెప్పాలనిపించిందని తెలిపాడు. అందుకే ఈ సినిమాలో నటించానని చెప్పుకొచ్చాడు. ఇక రాశి ఖన్నా చెప్తూ… కథ నచ్చిందని, సినిమాటోగ్రాఫర్ పీసీ శ్రీరామ్ ఈ సినిమాకు పని చేస్తున్నందుకు తాను చేసినట్లు చెప్పింది.

అంతేకాకుండా కరోనా సమయంలో ఫోన్ ఎక్కువగా చూసేవాడిని అని రోజు లేవడం తినడం ఫోన్ చేతిలో పట్టుకొని సోషల్ మీడియా కామెంట్స్ చూడటం పనిగా వుండేదని, అపుడు లైఫ్ సోషల్ మీడియా అవ్వకూడదని అర్థమైనట్లు చెప్పాడు నాగ చైతన్య. ఇక ఫస్ట్ లవ్ గురించి అడుగగా రాశి ఖన్నా అది ఒక మంచి ఫీలింగ్ అని చెప్పగా, నాగ చైతన్య… తొమ్మిదో తరగతిలో ముగ్గురం కలసి ఒక అమ్మాయిని ప్రేమించేవాళ్ళం, కానీ ఆ అమ్మాయి అందరి హృదయాలను ముక్కలు చేసి వెళ్ళిపోయింది, కానీ మేము ముగ్గురం మంచి ఫ్రెండ్స్ అయ్యాము అని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ కామెంట్స్ నెట్లో వైరల్ అవుతున్నాయి.

Bhargavi

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…

4 days ago

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

3 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

3 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

3 months ago