సినీ ఇండస్ట్రీలో మరో విషాదం చోటు చేసుకుంది. తెలుగువారందరికీ సుపరిచితుడైన సుప్రసిద్ధ గాయకుడు ఘంటసాల రెండో కుమారుడు రత్న కుమార్ ఈరోజు గురువారం ఉదయం గుండెపోటుతో కన్నుమూసారు. గుండెపోటుతో చెన్నైలోని కావేరి హాస్పిటల్‌లో ఈరోజు ఉదయం తుదిశ్వాస విడిచారు.
అయితే ఇదివరకే గంటశాల రత్న కుమ్మర్ కు కరోనా పాజిటివ్ వచ్చింది, రెండు రోజుల క్రితమే కోవిడ్ నెగిటివ్ వచ్చిందని సమాచారం. అయితే గత కొంతకాలంగా అయన కిడ్నీ సంబంధిత సమస్యతో బాధపడుతూ డయాలసిస్ చేయించుకుంటున్నారు. ఈ నేపధ్యంలో రత్నకుమార్ ఆకస్మిక మరణంతో ఘంటసాల కుటుంబంతో పాటూ సినీ పరిశ్రమలో విషాదం నెలకొంది. రత్నకుమార్ మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు.
ఘంటసాల వెంకటేశ్వరరావు , సావిత్రి దంపతుల రెండో కుమారుడే రత్న కుమార్. ఈయన ప్రస్తుతం చిత్ర పరిశ్రమలో డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా ఉన్నారు. తెలుగు,తమిళం తో పాటూ వివిధ భాషల్లో కొన్ని వేల సినిమాలకు, సీరియల్స్‌కు రత్నకుమార్ డబ్బింగ్ చెప్పారు.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…