Categories: FeaturedGeneral News

రైతులకు గుడ్ న్యూస్.. ఆ పంటల కనీస మద్దతు ధర పెంపు..

రైతులకు ప్రభుత్వం ఇప్పటికే పలు రకాల పథకాలను ప్రవేశపెడుతూ.. వారికి భరోసాగా నిలుస్తోంది. పీఎం కిసాన్ తో పంటలకు పెట్టుబడి కింద సంవత్సరానికి రూ. 6వేలు రైతుల ఖాతాల్లో జమ అవుతున్నాయి. ఈ ఆర్థిక సాయం రైతులకు ఎంతో మేలు చేకూర్చుతుంది. అయితే తాజాగా మోడీ సర్కారు మరో శుభవార్త చెప్పింది. అదేంటంటే.. రబీ పంటలకు కనీస మద్దతును పెంచుతూ.. కేంద్ర ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ ఆమోదం తెలిపింది.

రబీ సీజన్‌లో పంటలు వేసే రైతులందరికీ ఈ నిర్ణయం వర్తిస్తుందని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. వేర్వేరు పంటలకు కనీసం రూ. 40 నుంచి రూ. 400 వరకు కనీస మద్దతు ధర పెంచినట్లు కేంద్రం వెల్లడించింది. ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన కేంద్రమంత్రి మండలి బుధవారం సమావేశమైంది.

ఈ సందర్బంగా దేశంలో 2022-23 మార్కెటింగ్ సీజ‌న్‌లో అధీకృత రబీ పంటలన్నిటికీ కనీస మద్దతు ధర ను పెంచే ప్రతిపాదనకు ఆమోదముద్ర వేసింది. ఇందులో గోధుమలకు క్వింటాల్ కు 1,975 నుంచి 2015గా.. బార్లీకి 2021-22 లో రబీ మార్కెట్ సీజన్‌లో కనీస మద్దతు ధర రూ.1,600 ఉండగా.. తాజాగా దానిని రూ.1,635 గా ప్రకటించింది.

శనగలకు రూ.5,100 నుంచి 5,230 వరకు.. ఎర్ర పప్పు రూ.5,100 నుంచి రూ.5,500 గా ప్రకటించింది ప్రభుత్వం. ఆవాలకు రూ.4,650 నుంచి రూ.5,050 గా.. కుసుమలకు రూ.5,327 నుంచి సీజన్‌కు కనీస మద్దతు ధర రూ.5,441 గా ప్రకటించింది ప్రభుత్వం. రైతుల్లో ఇతర పంటలను ప్రోత్సహించాలన్న ఉద్దేశ్యంతో కేంద్ర ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago