యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్ ఇటీవల తమ అభిమాన నటుడికి సంబంధించి సినిమా అప్ డేట్స్ ఇవ్వడం లేదని బాధపడ్డారు. అందులో ఓ అభిమాని అయితే ఏకంగా సూసైడ్ నోటే రాసేశాడు. మరో అభిమాని యూవీ క్రియేషన్స్ పై కేసు పెట్టండి సార్.. వాళ్లు తమ ఎమోషన్స్ తో ఆడుకుంటున్నారంటూ ఏకంగా సైబరాబాద్ పోలీసులకు ట్వీట్ చేశాడు.
ఇలా జరిగిన తర్వాత రాధే శ్యామ్ నుంచి అప్ డేట్ వచ్చింది. ఓ సాంగ్ ను విడుదల చేశారు చిత్ర సభ్యులు. ఇక తాజాగా ఈ సినిమా నుంచి క్రేజీ అప్ డేట్ వచ్చింది. ఇప్పటికే ఫస్ట్ గ్లింప్స్ విడుదల చేసి అంచనాలు భారీగా పెంచిన మేకర్స్ రెండో సాంగ్‌కి సంబంధించిన అప్‌డేట్ ఇచ్చింది. వన్ హార్ట్ టూ హార్ట్ బీట్స్ సాంగ్ లాంచ్‌కు ముందు దాని టీజర్ రేపు (నవంబర్ 29) విడుదల కానుంది.
‘రాధేశ్యామ్’ లవ్ ఆంథెమ్ సెకండ్ సాంగ్ హిందీ టీజర్‌ని మధ్యాహ్నం 1 గంటలకు లాంచ్ చేయనుండగా, తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ వెర్షన్‌లను రాత్రి 7 గంటలకు లాంచ్ చేయనున్నారు. దానికి సంబంధించిన పోస్టర్ ను సభ్యులు ట్విట్టర్ ద్వారా పంచుకున్నారు. ఇక ఈ సినిమా జనవరి 14 న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
పాన్ ఇండియా లెవల్లో విడుదల కానున్న ఈ సినిమా
గోపి కృష్ణ మూవీస్ ప్రైవేట్ లిమిటెడ్, యువీ క్రియేషన్స్ ద్వారా భారీ బడ్జెట్‌తో రూపొందుతోంది.
దీనికి జస్టిన్ ప్రభాకరన్ సంగీతం అందించగా, మనోజ్ పరమహంస సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ప్రభాస్ సినిమాల్లో అన్నింటి కంటే ఈ సినిమా డిఫరెంట్ గా ఉండబోతోందని చిత్ర బృందం సభ్యులు తెలిపారు.
చాలామంది ఇళ్లలో ఒకే సీన్ కనిపిస్తుంది. రాత్రి మిగిలిన అన్నాన్ని ఉదయాన్నే చెత్తబుట్టలో పడేయడం. “పాత అన్నం తింటే కడుపు…
దక్షిణాది సినీ పరిశ్రమలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్న హీరోయిన్ Regina Cassandra తాజాగా బాలీవుడ్ అనుభవాలపై సంచలన వ్యాఖ్యలు…
2026 టీ20 వరల్డ్ కప్ ఉత్కంఠభరిత దశలోకి అడుగుపెట్టింది. లీగ్ పోరాటాలు దాదాపు ముగియడంతో ఇప్పుడు అందరి చూపు సూపర్-8…
అంతరిక్ష రంగంలో కెరీర్ కలలు కనే విద్యార్థులకు ఇది మంచి అవకాశం. భారత అంతరిక్ష పరిశోధనా సంస్థకు చెందిన విక్రమ్…
తిరుపతి నగరానికి కొద్ది దూరంలో, రేణిగుంట మండలంలోని గుడిమల్లం గ్రామంలో ఒక అపూర్వ చారిత్రక కట్టడం భక్తులను, చరిత్రాభిమానులను సమానంగా…
తమిళనాడు రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి.…