AP Politics: ఆంధ్రప్రదేశ్లో కూటమి అధికారంలోకి వచ్చినప్పటికీ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఆదరణ తగ్గలేదని తెలుస్తుంది. అయితే ఇటీవల విశాఖ ఎమ్మెల్సీ ఉప ఎన్నికలలో భాగంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి బొత్స సత్యనారాయణ నామినేషన్ దాఖలు చేశారు అయితే వారం రోజుల నుంచి పెద్ద ఎత్తున ఈ ఎన్నికలపై చర్చలు జరిగాయి అయితే ఈ ఎన్నికలకు తాజాగా తెరపడినట్లు తెలుస్తోంది.
ఈ ఎమ్మెల్సీ ఉప ఎన్నికల పోటీ నుంచి అధికార టిడిపి పార్టీ వెనక్కు తగ్గింది. ఇలా పార్టీ వెనక్కి తగ్గడం వెనక వైసీపీ వ్యూహం ఏంటి అనేది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జరుగుతున్న ఉప ఎన్నిక కావడంతో ఈ ఎన్నికలపై ఎంతో ఆసక్తి నెలకొంది. కూటమి పోటీ చేయొచ్చనే ప్రచారంతో వైసీపీ ఎంతో టెన్షన్ పడింది. తన ఓటర్లను కాపాడుకోడానికి క్యాంపు రాజకీయాలకు తెరతీసింది. ఐతే తాము పోటీకి దూరంగా ఉంటున్నట్లు నామినేషన్ల చివరి రోజున చెప్పడంతో సత్యనారాయణ ఎంపిక లాంచనమేనని తెలుస్తుంది.
వైసీపీకే మెజారిటీ..
ఇలా ఈ ఉప ఎన్నికలకు అధికార పార్టీ దూరంగా ఉండడానికి గల కారణం ఏంటి అనే ప్రశ్న అందరిలోనూ కలుగుతుంది. ఈ ఎన్నికలలో కేవలం 830 ఓట్లు ఉన్న ఈ స్థానంలో ఎక్కువ మంది గ్రామీణ ప్రాంతానికి చెందిన ప్రజాప్రతినిధులే ఉన్నారు… ఇందులో వైసీపీకి చెందిన వారే సుమారుగా 550 మంది వరకు ఉంటారు. టీడీపీ మిత్రపక్షాలకు కేవలం 250 ఓట్లు మాత్రమే ఉన్నాయి. దీంతో వైసీపీకే ఎక్కువ మద్దతు ఉండటంతో అధికార పార్టీ తప్పుకున్నారని తెలుస్తోంది. ఇక జగన్ కూడా ఈ ఎన్నికకు బొత్స సత్యనారాయణ ను ఎంపిక చేయడంతో కూటమి ప్రభుత్వం ఎవరిని బరిలోకి దింపలేదు కానీ జగన్ ఎన్నో వ్యూహాలు రచించే తనని రంగంలోకి దింపారని ఈ విషయంలో వైసీపీ సక్సెస్ అయిందని తెలుస్తుంది.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…