Connect with us

Featured

AP Politics: విశాఖ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక… వెనక్కి తగ్గిన టీడీపీ… వైసీపీ ప్లాన్ సక్సెస్ అయిందా?

Published

on

AP Politics: ఆంధ్రప్రదేశ్లో కూటమి అధికారంలోకి వచ్చినప్పటికీ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఆదరణ తగ్గలేదని తెలుస్తుంది. అయితే ఇటీవల విశాఖ ఎమ్మెల్సీ ఉప ఎన్నికలలో భాగంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి బొత్స సత్యనారాయణ నామినేషన్ దాఖలు చేశారు అయితే వారం రోజుల నుంచి పెద్ద ఎత్తున ఈ ఎన్నికలపై చర్చలు జరిగాయి అయితే ఈ ఎన్నికలకు తాజాగా తెరపడినట్లు తెలుస్తోంది.

Advertisement

ఈ ఎమ్మెల్సీ ఉప ఎన్నికల పోటీ నుంచి అధికార టిడిపి పార్టీ వెనక్కు తగ్గింది. ఇలా పార్టీ వెనక్కి తగ్గడం వెనక వైసీపీ వ్యూహం ఏంటి అనేది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జరుగుతున్న ఉప ఎన్నిక కావడంతో ఈ ఎన్నికలపై ఎంతో ఆసక్తి నెలకొంది. కూటమి పోటీ చేయొచ్చనే ప్రచారంతో వైసీపీ ఎంతో టెన్షన్‌ పడింది. తన ఓటర్లను కాపాడుకోడానికి క్యాంపు రాజకీయాలకు తెరతీసింది. ఐతే తాము పోటీకి దూరంగా ఉంటున్నట్లు నామినేషన్ల చివరి రోజున చెప్పడంతో సత్యనారాయణ ఎంపిక లాంచనమేనని తెలుస్తుంది.

వైసీపీకే మెజారిటీ..
ఇలా ఈ ఉప ఎన్నికలకు అధికార పార్టీ దూరంగా ఉండడానికి గల కారణం ఏంటి అనే ప్రశ్న అందరిలోనూ కలుగుతుంది. ఈ ఎన్నికలలో కేవలం 830 ఓట్లు ఉన్న ఈ స్థానంలో ఎక్కువ మంది గ్రామీణ ప్రాంతానికి చెందిన ప్రజాప్రతినిధులే ఉన్నారు… ఇందులో వైసీపీకి చెందిన వారే సుమారుగా 550 మంది వరకు ఉంటారు. టీడీపీ మిత్రపక్షాలకు కేవలం 250 ఓట్లు మాత్రమే ఉన్నాయి. దీంతో వైసీపీకే ఎక్కువ మద్దతు ఉండటంతో అధికార పార్టీ తప్పుకున్నారని తెలుస్తోంది. ఇక జగన్ కూడా ఈ ఎన్నికకు బొత్స సత్యనారాయణ ను ఎంపిక చేయడంతో కూటమి ప్రభుత్వం ఎవరిని బరిలోకి దింపలేదు కానీ జగన్ ఎన్నో వ్యూహాలు రచించే తనని రంగంలోకి దింపారని ఈ విషయంలో వైసీపీ సక్సెస్ అయిందని తెలుస్తుంది.

Advertisement
Continue Reading
Advertisement

Featured

Bigg Boss 8: లీక్ అయిన బిగ్ బాస్ 8 విన్నర్… ఎవరో తెలుసా?

Published

on

Bigg Boss 8: బిగ్ బాస్ 8 తెలుగు కార్యక్రమం ప్రస్తుతం ప్రసారమవుతున్న సంగతి మనకు తెలిసిందే. ఇప్పటికే రెండు వారాలు పూర్తి చేసుకున్న ఈ కార్యక్రమం మూడో వారంలోకి అడుగు పెట్టింది. ఇక 14 మంది కంటెస్టెంట్లతో ప్రారంభమైన ఈ కార్యక్రమం నుంచి ఇప్పటికే ఇద్దరు కంటెస్టెంట్లు ఎలిమినేట్ అయ్యారు. ఇకపోతే ఐదవ వారంలో మరికొంతమంది కంటెస్టెంట్లు హౌస్ లోకి అడుగు పెట్టబోతున్నారని తెలుస్తుంది.

Advertisement

ఇక ఈ సీజన్లో పాల్గొన్న కంటెస్టెంట్లు అందరూ కూడా ఎక్కువగా బుల్లితెర నటీనటులు ఉండటం విశేషం. ఇక బిగ్ బాస్ కార్యక్రమం ప్రారంభమైన సమయం నుంచి విన్నర్ ఎవరు అనే విషయం గురించి పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో వార్తలు హల్చల్ చేస్తూ ఉంటాయి. ఇక బిగ్ బాస్ కార్యక్రమానికి సంబంధించిన ఎన్నో విషయాలు కూడా సోషల్ మీడియాలో లీక్ అవుతూ ఉంటాయి.

బిగ్ బాస్ నిర్వహకులు ఈ కార్యక్రమానికి సంబంధించి ఎలాంటి లీకులు లేకుండా ఎంత జాగ్రత్త పడినప్పటికీ ఈ కార్యక్రమానికి సంబంధించిన ఎన్నో విషయాలు మాత్రం బయటకు వస్తూ ఉంటాయి. అయితే తాజాగా ఈ కార్యక్రమంలో భాగంగా విన్నర్ ఎవరు అనే విషయం గురించి ఒక వార్త హల్చల్ చేస్తోంది.

విన్నర్ విష్ణుప్రియ..
ఇక హౌస్ లోకి వెళ్లిన కంటెస్టెంట్లలో కాస్తో కూస్తో ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువగా ఉన్నటువంటి వారిలో విష్ణు ప్రియ ఒకరు. ఈమెకు సోషల్ మీడియాలో ఎంతో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అయితే హౌస్ లో కూడా విష్ణుప్రియ చాలా జెన్యూన్ గా గేమ్ ఆడటమే కాకుండా అన్ని విషయాలను పాజిటివ్గా తీసుకుంటూ ఎంతో మంది అభిమానులను కూడా ఆకట్టుకున్నారు. దీంతో విష్ణు ప్రియనే ఈ సీజన్ విన్నర్ కావచ్చనే అభిప్రాయాలు కూడా చాలామందిలో ఉన్నాయి. ఇక ఇప్పటివరకు హౌస్ నుంచి బయటకు వచ్చిన ఇద్దరు కంటెస్టెంట్లు కూడా విష్ణు ప్రియ పేరును చెప్పడంతో ఈ సీజన్ విన్నర్ ఆమెనని స్పష్టంగా అర్థమవుతుంది.

Advertisement

Advertisement
Continue Reading

Featured

Anushka: ఆ డైరెక్టర్ కు ప్రతి ఏడాది ఐఫోన్ గిఫ్ట్… స్వీటీ యవ్వారం ఏదో తేడాగా ఉందే?

Published

on

Anushka: సూపర్ సినిమా ద్వారా ఇండస్ట్రీకి హీరోయిన్గా పరిచయమయ్యారు నటి అనుష్క శెట్టి. ఇలా నటిగా ఇండస్ట్రీలో ఎన్నో అద్భుతమైన సినిమాలలో నటిస్తూ ప్రేక్షకులను మెప్పించారు. ఇలా ఇండస్ట్రీలోకి వచ్చిన మొదట్లోనే ఈమె అరుంధతి వంటి లేడి ఓరియంటెడ్ సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి అందరికీ షాక్ ఇచ్చారు. అయితే ఈ సినిమాతో ఎంతో మంచి సక్సెస్ అందుకున్న అనుష్కకు అవకాశాలు క్యూ కట్టాయి.

Advertisement

ఇలా ఎన్నో అద్భుతమైన తెలుగు తమిళ భాష చిత్రాలలో నటిస్తూ ప్రేక్షకులను మెప్పించిన ఈమె బాహుబలి సినిమా ద్వారా పాన్ ఇండియా స్టార్ హీరోయిన్ గా గుర్తింపు పొందారు. అయితే పలు ప్రయోగాత్మక సినిమాలలో నటించిన అనుష్క అధిక శరీర బరువు కావడంతో కొంతకాలం పాటు సినిమాలకు దూరంగా ఉన్నారు. ప్రస్తుతం పలు భాష చిత్రాలలో నటిస్తూ బిజీగా ఉన్న అనుష్కకు సంబంధించి ఒక వార్త వైరల్ అవుతుంది.

ఇటీవల సంగీత దర్శకుడు ఎస్ఎస్ తమన్ అనుష్క మంచితనం గురించి మాట్లాడుతూ ఆసక్తికరమైన విషయాలు వెల్లడించారు. అనుష్క మంచితనం చూస్తే ఇలాంటి వ్యక్తులు కూడా భూమి మీద ఉంటారా అనే ఆశ్చర్యం కలుగుతుందని ఆయన అనుష్క పై ప్రశంసల వర్షం కురిపించారు. అంతేకాకుండా అనుష్కకు సంబంధించి ఒక ఆసక్తికరమైన విషయాన్ని కూడా బయటపెట్టారు.

సెప్టెంబర్ నెలలో..
అనుష్క ప్రతి ఏడాది సెప్టెంబర్ నెలలో తనకు ఐఫోన్ గిఫ్ట్ గా పంపిస్తుందని ఈయన తెలిపారు. నా మీద ఆమె చూపించే ఈ ప్రత్యేకమైన ప్రేమకు నేను కృతజ్ఞుడిని అంటూ ఈయన కామెంట్లు చేశారు. అయితే వీరిద్దరి కాంబినేషన్లో వచ్చింది కేవలం రెండు సినిమాలే కానీ ఈ రెండు సినిమాలకి వీరిద్దరి మధ్య ఇలాంటి బాండింగ్ ఏర్పడటంతో అభిమానులు కూడా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

Advertisement
Continue Reading

Featured

Mokshagna: మోక్షజ్ఞ మొదటి సినిమాకే 100 కోట్ల బడ్జెట్.. సాహసమే అని చెప్పాలి?

Published

on

Mokshagna: నందమూరి నట సింహం బాలకృష్ణ వారసుడిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వడానికి మోక్షజ్ఞ సిద్ధంగా ఉన్నారు. ఇప్పటికే ఈయన ఫస్ట్ సినిమాకి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల చేశారు. ఈ పోస్టర్ లో మోక్షజ్ఞ లుక్ కి అభిమానులు ఫిదా అయ్యారు. ఇక ఈ సినిమాకు డైరెక్టర్ ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహించబోతున్న సంగతి తెలిసిందే.

Advertisement

యంగ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమాకు బాలకృష్ణ కుమార్తె నందమూరి తేజస్విని నిర్మాతగా వ్యవహరించబోతున్నారు. ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. అతి త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన మరికొన్ని విషయాలను వెల్లడించడమే కాకుండా ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ పనులు కూడా ప్రారంభం కాబోతున్నాయి.

ఈ సినిమా కోసం మోక్షజ్ఞ భారీ స్థాయిలోనే రెమ్యూనరేషన్ అందుకోబోతున్నారని సమాచారం. ఈ సినిమా కోసం ఈయన ఏకంగా 20 కోట్ల రూపాయల వరకు రెమ్యూనరేషన్ అందుకోబోతున్నట్లు వార్తలు హల్చల్ చేస్తున్నాయి. ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో ఈ సినిమాలో ఇతర భాష సెలబ్రిటీలను కూడా భాగం చేయబోతున్నారు.

20 కోట్ల రెమ్యూనరేషన్..
ఇదిలా ఉండగా తాజాగా ఈ సినిమాకు సంబంధించి మరో ఆసక్తికరమైన వార్త వైరల్ అవుతుంది. ఈ సినిమా కోసం భారీ స్థాయిలో బడ్జెట్ కేటాయిస్తున్నట్లు తెలుస్తోంది. ఏకంగా 100 కోట్ల రూపాయల బడ్జెట్ కేటాయించారని సమాచారం. ఈ విధంగా ఒక డెబ్యూ హీరో సినిమాకు ఈ స్థాయిలో బడ్జెట్ కేటాయించడం అంటే నిజంగా సాహసం అనే చెప్పాలి. అయితే మోక్షజ్ఞ ఇండస్ట్రీలోకి రాకముందే ఈయనకు భారీ స్థాయిలో అభిమానులు ఉన్నారు కనుక ఈ సినిమాపై ఎంతో నమ్మకంతోనే భారీ స్థాయిలో బడ్జెట్ కేటాయిస్తున్నట్లు తెలుస్తోంది.

Advertisement

Advertisement
Continue Reading
Advertisement

Trending

Don`t copy text!