కేంద్ర ప్రభుత్వం రైతుల ఆదాయం పెంచాలనే లక్ష్యంతో ఎన్నో సంక్షేమ కార్యక్రమాలను ప్రవేశపెడుతోంది. అందులో భాగంగానే ముఖ్యంగా ప్రధాన్ మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి స్కీమ్ ఒకటి. ఇది రైతులకు ఎంతగానో ఉపయోగపడుతోంది. దీని ద్వారా రైతులకు ఏడాదికి రూ.6,000 అందిస్తోంది. మూడు విడతల్లో రూ.2,000 చొప్పున డబ్బులు రైతుల బ్యాంక్ ఖాతాల్లో జమవుతున్నాయి.
మోదీ సర్కార్ కేవలం ఈ ఒక్క స్కీమ్ మాత్రమే కాకుండా రైతుల కోసం మరో పథకాన్ని కూడా అందిస్తోంది. దీని పేరు పీఎం కిసాన్ మాన్ ధన్ యోజన. ఈ పథకంలో కూడా రైతులు చేరొచ్చు. పీఎం కిసాన్ మాన్ ధన్ యోజన స్కీమ్‌లో చేరిన వారికి ప్రతి నెలా రూ.3,000 వస్తాయి. కామన్ సర్వీస్ సెంటర్‌కు వెళ్లి.. మన వివరాలను నమోదు చేసి ఈ పథకంలో చేరొచ్చు.
18 నుంచి 40 ఏళ్లలోపు ఉన్న రైతులు ఈ స్కీమ్‌లో చేరేందుకు అర్హులు. ఈ స్కీమ్‌లో ఇప్పటికే 21,23,809 మంది రైతులు చేరారు. రిజిస్ట్రేషన్ చేసుకున్న రైతులకు 60 ఏళ్లు వయసు రాగానే వారికి నెలకు రూ.3వేల పెన్షన్ అందుతుంది. ఇందుకోసం రైతులు నెలకు రూ.55 నుంచి రూ.200 వరకు ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది.
ఈ పథకంలో చేరడానికి ఆధార్ కార్డు, పొలం పట్టా, బ్యాంక్ పాస్‌బుక్, రెండు పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోలు అవసరం. 18 ఏళ్ల వయస్సు ఉన్న రైతు ఈ పథకంలో చేరితే నెలకు రూ.55 కట్టాల్సి ఉండగా.. 40 ఏళ్లలో చేరిన రైతు నెలకు రూ.200 చెల్లించాలి. ఇలా వయస్సును బట్టి ప్రీమియం మారుతూ ఉంటుంది. ఇలా 20 సంవత్సరాల వరకు ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. 60 ఏళ్లు దాటిన తర్వాత ప్రతి నెలా రైతులకు రూ.3,000 పెన్షన్ లభిస్తుంది. ఒక వేళ రైతు మరణిస్తే నామినీకి 50 శాతం డబ్బులు చెల్లిస్తారు.
భారత రూపాయి చరిత్రలో ఎన్నడూ లేని స్థాయిలో పతనమవుతోంది. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ రోజురోజుకు దిగజారుతూ ఆల్‌టైం…
చలికాలం వచ్చిందంటే చాలు.. చాలా మందికి ఒక విచిత్రమైన అనుభవం ఎదురవుతుంటుంది. కారు డోర్ తీస్తున్నా, కుర్చీలో కూర్చుంటున్నా, కనీసం…
నేటి ఉరుకుల పరుగుల జీవితంలో మానసిక ప్రశాంతతకు, శారీరక దృఢత్వానికి చాలామంది యోగాను ఆశ్రయిస్తున్నారు. అయితే, యోగా చేసేవారిని తరచుగా…
చేపలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయనడంలో సందేహం లేదు. అయితే, చేపలను ఏ ఆహారాలతో కలిపి తింటున్నాం అన్నదే అసలు…
కేంద్రంలోని మోదీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయానికి సిద్ధమవుతోంది. ఇప్పటివరకు అమలులో ఉన్న **మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ…
ప్రపంచం అంతా సోషల్ మీడియాకు బానిసైపోతున్న వేళ… ఆస్ట్రేలియా ఒక చారిత్రక నిర్ణయం తీసుకుంది. డిసెంబర్ 10 నుంచి అక్కడ…