Categories: FeaturedHealth News

పొద్దు తిరుగుడు గింజలతో ఆ సమస్యకు చెక్ .. ఇంకా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు..!

ప్రస్తుత జీవన శైలిలో ఉరుకులు, పరుగుల జీవితంలో పడి ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారు. తినే ఆహారం విషయంలో ఎక్కువగా తప్పులు చేస్తున్నారు. ఇన్ స్టాంట్ గా ఎక్కడ ఆహారం దొరికితే అక్కడ తినేస్తున్నారు. దీంతో వివిధ రకాల వ్యాధుల బారిన పడుతున్నారు. దీనిలో ఎక్కువ బాధిస్తున్న వ్యాధి డయాబెటిస్. చాలామందికి ఈ షుగర్ వ్యాధి అనేది సర్వ సాధారణంగా వస్తుంది.

దీనిని నివారించాలంటే.. వంటింటి చిట్కా ద్వారా చేయవచ్చు. అది ఎలా అంటే.. పొద్దుతిరుగుడు విత్తనాల గురించి అందరికీ తెలిసిందే. వీటిలో ఉన్న పోషకాలు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వీటిలో కేలరీలతోపాటూ… ముఖ్యమైన ఫ్యాటీ యాసిడ్స్, విటమిన్స్, మినరల్స్ వంటివి ఎక్కువగా ఉంటాయి. ఈ విత్తనాల్ని పొద్దు తిరుగుడు పువ్వు మధ్యలో నుంచీ సేకరిస్తారు.

ఇవి బూడిద రంగులో లేదా నలుపు రంగులో ఉంటాయి. నీటి బిందువు ఆకారంలో కనిపిస్తాయి. సైంటిఫిక్‌గా మూడు రకాల సన్‌ఫ్లవర్ సీడ్స్ ఉన్నాయి. అవి లైనోలెయిక్, హైలీ ఒలెయిక్, న్యూసన్. విత్తనాల్లోని మోనోశాచురేటెడ్, శాచురేటెడ్, పాలీఅన్‌శాచురేటెడ్ ఫ్యాట్స్ ఆధారంగా వాటిని విభజించారు. ఫైబర్ ఎక్కువగా ఉన్న వీటిని తీసుకోవడం వల్ల ఎక్కువగా ఆకలి వేయదు.

అంతేకాకుండా.. డయాబెటిస్ వారికి ఈ గింజలు మంచిగా ఉపయోగపడతాయి. అందుకనే షుగర్ వ్యాధిగ్రస్థులు తమ డైట్ లో భాగంగా పొద్దు తిరుగుడు విత్తనాలను తీసుకుంటే షుగర్ కంట్రోల్ లోకి వస్తుందని పలు అధ్యయనాలు ద్వారా తెలుస్తోంది. అయితే ఈ గింజలను నేరుగా గానీ.. లేదా నానబెట్టి గానీ తినవచ్చు. నేరుగా తినడం వల్ల అస్తమా, కీళ్ల నొప్పులు ఉన్న వారికి ఎంతగానో ఉపశమనం కలిగిస్తుంది. చర్మ సంబంధిత వ్యాధుల నుంచి కూడా ఈ గింజలు కాపాడతాయి.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…

1 month ago

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

3 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

3 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

4 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

4 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

4 months ago