General News

నెలకు కేవలం రూ.55లతో.. రూ.3000 పెన్షన్ పొందండి.. ఎలా అంటే..!

కేంద్ర ప్రభుత్వం రైతుల ఆదాయం పెంచాలనే లక్ష్యంతో ఎన్నో సంక్షేమ కార్యక్రమాలను ప్రవేశపెడుతోంది. అందులో భాగంగానే ముఖ్యంగా ప్రధాన్ మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి స్కీమ్ ఒకటి. ఇది రైతులకు ఎంతగానో ఉపయోగపడుతోంది. దీని ద్వారా రైతులకు ఏడాదికి రూ.6,000 అందిస్తోంది. మూడు విడతల్లో రూ.2,000 చొప్పున డబ్బులు రైతుల బ్యాంక్ ఖాతాల్లో జమవుతున్నాయి.

మోదీ సర్కార్ కేవలం ఈ ఒక్క స్కీమ్ మాత్రమే కాకుండా రైతుల కోసం మరో పథకాన్ని కూడా అందిస్తోంది. దీని పేరు పీఎం కిసాన్ మాన్ ధన్ యోజన. ఈ పథకంలో కూడా రైతులు చేరొచ్చు. పీఎం కిసాన్ మాన్ ధన్ యోజన స్కీమ్‌లో చేరిన వారికి ప్రతి నెలా రూ.3,000 వస్తాయి. కామన్ సర్వీస్ సెంటర్‌కు వెళ్లి.. మన వివరాలను నమోదు చేసి ఈ పథకంలో చేరొచ్చు.

18 నుంచి 40 ఏళ్లలోపు ఉన్న రైతులు ఈ స్కీమ్‌లో చేరేందుకు అర్హులు. ఈ స్కీమ్‌లో ఇప్పటికే 21,23,809 మంది రైతులు చేరారు. రిజిస్ట్రేషన్ చేసుకున్న రైతులకు 60 ఏళ్లు వయసు రాగానే వారికి నెలకు రూ.3వేల పెన్షన్ అందుతుంది. ఇందుకోసం రైతులు నెలకు రూ.55 నుంచి రూ.200 వరకు ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది.

ఈ పథకంలో చేరడానికి ఆధార్ కార్డు, పొలం పట్టా, బ్యాంక్ పాస్‌బుక్, రెండు పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోలు అవసరం. 18 ఏళ్ల వయస్సు ఉన్న రైతు ఈ పథకంలో చేరితే నెలకు రూ.55 కట్టాల్సి ఉండగా.. 40 ఏళ్లలో చేరిన రైతు నెలకు రూ.200 చెల్లించాలి. ఇలా వయస్సును బట్టి ప్రీమియం మారుతూ ఉంటుంది. ఇలా 20 సంవత్సరాల వరకు ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. 60 ఏళ్లు దాటిన తర్వాత ప్రతి నెలా రైతులకు రూ.3,000 పెన్షన్ లభిస్తుంది. ఒక వేళ రైతు మరణిస్తే నామినీకి 50 శాతం డబ్బులు చెల్లిస్తారు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago