Jyothi Rai: జ్యోతిరాయ్ అంటే గుర్తుపట్టలేరేమో కానీ జగతి మేడం అంటే మాత్రం టక్కున ఈమె గుర్తుకు వస్తుంది. గుప్పెడంత మనసు సీరియల్ లో ఎంతో అద్భుతంగా నటించి ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నటువంటి ఈమె ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో ఈమె చేసే హంగామా మామూలుగా లేదు. సీరియల్లో చీరకట్టులో ఎంతో పద్ధతిగా కనిపించిన జ్యోతి బయట మాత్రం భారీ అందాలను ఆరబోస్తూ రచ్చ చేశారు.
ఇక వయసులో తనకంటే చిన్నవాడైన దర్శకుడితో ప్రేమలో పడి ఈమె పెళ్లి చేసుకున్నారు తరచూ తన భర్తతో కలిసి సోషల్ మీడియాలో చేసే హంగామా మామూలుగా ఉండదు. అయితే తాజాగా తన భర్త పై ఉన్నటువంటి ప్రేమను మొత్తం బయట పెట్టారు. ఈమె డైరెక్టర్ సుక్ పూర్వజ్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. తాజాగా ఆయన పుట్టినరోజు కావడంతో ఈమె సోషల్ మీడియా వేదికగా షేర్ చేసిన పోస్ట్ వైరల్ గా మారింది.
మనం కలిసి ఏడాది పూర్తి అయింది. ఇప్పుడు నా జీవితం ఎంత సంతోషంగా ఉందో నేను మాటల్లో చెప్పలేను. నువ్వు చూపిస్తున్న ప్రేమ, లవ్, ఇచ్చే హగ్స్, కిస్సులు, సపోర్ట్, ఎంకరేజ్ మెంట్, నీ పాజిటివ్ థాట్స్ ఇలా అన్నింటికి థాంక్స్.. నీ సహనం.. నాపై చూపించే ప్రేమ, కేరింగ్, విధేయత ఇలా అన్నింటికీ థాంక్స్..
భర్తగా రావటం నా అదృష్టం..
నీ రాకతో నా జీవితం సంపూర్ణమైంది. నువ్వు నా భర్తగా రావడం నా అదృష్టం హ్యాపీ బర్త్ డే డార్లింగ్.. లవ్యూ అన్ కండీషనల్లీ అంటూ జ్యోతి రాయ్ వేసిన పోస్ట్ ఇప్పుడు వైరల్ అవుతోంది. ఇలా ఈమె తాను పెళ్లి చేసుకున్నాను అనే విషయాన్ని తెలియజేయకుండా పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో తన భర్తతో కలిసి ఉన్నటువంటి ఫోటోలను షేర్ చేయడం వీరి పట్ల ఎన్నో విమర్శలు వచ్చాయి తాజాగా ఈమె చేసిన పోస్ట్ చూస్తుంటే వీరిద్దరు పెళ్లి చేసుకున్నారని అర్థమవుతుంది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…