Varun Tej: మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఇటీవల పెళ్లి చేసుకుని కొత్త జీవితంలోకి అడుగు పెట్టారు. ఇలా పెళ్లి తర్వాత ఈయన కెరియర్ పరంగా వరుస సినిమాలకు కమిట్ అవుతూ ఎంతో బిజీగా ఉన్నారు. అయితే ఒకప్పుడు ఇంటర్వ్యూలలో పాల్గొనటానికి కూడా ఎంతో మొహమాట పడేవారు ఇటీవల కాలంలో పెద్ద ఎత్తున ఇంటర్వ్యూలకు హాజరవుతూ తన సినిమా విషయాలు మాత్రమే కాకుండా వ్యక్తిగత విషయాలను కూడా అభిమానులతో పంచుకుంటున్నారు.
ఇక త్వరలోనే ఈయన నటించిన ఆపరేషన్ వాలంటైన్ అనే సినిమా కూడా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా మార్చి 1వ తేదీ విడుదల కానుంది. ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడుతున్నటువంటి తరుణంలో ప్రమోషన్ కార్యక్రమాలను కూడా నిర్వహించారు. ఇటీవల ఈ సినిమా నుంచి సెకండ్ సాంగ్ విడుదల చేశారు. అయితే ఈ సాంగ్ మల్లారెడ్డి కాలేజీలో విడుదల చేయగా స్టూడెంట్స్ తో వరుణ్ ఇంటరాక్ట్ అయ్యారు.
ఇలా విద్యార్థులు అడిగే ప్రశ్నలన్నింటికీ ఈయన సమాధానాలు చెప్పారు. అయితే చాలా వరకు ఈయన వ్యక్తిగత విషయాలకు సంబంధించిన ప్రశ్నలే వేశారు. ఇలా స్టూడెంట్స్ అడిగినటువంటి ప్రశ్నలకు వారు చెప్పినటువంటి సమాధానాలు విని నేటిజన్స్ షాక్ అవుతున్నారు. దీంతో వరుణ్ పట్ల నేటిజన్స్ చేస్తున్నటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
లావణ్య కారణమా..
ఒకప్పుడు ఇంటర్వ్యూలలో మాట్లాడడానికి కూడా ఎంతో ఇబ్బంది పడే వరుణ్ తేజ్ ఇటీవల కాలంలో చాలా అద్భుతంగా ఇంటర్వ్యూలలో మాట్లాడుతున్నారని ఈయనలో పెళ్లి తర్వాత చాలా మార్పు వచ్చిందని కామెంట్లు చేస్తున్నారు. నువ్వు చాలా మారిపోయావన్న ఈ మార్పుకు కారణం లావణ్య కదా అంటూ పలువురు కామెంట్లు చేస్తున్నారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…