General News

అతడికి 42.. ఆమెకు 22.. కూతురు వయసున్న యువతితో ప్రేమ! చివరకు ఇద్దరూ..

వరంగల్, తెలంగాణ: వరంగల్‌లో వివాహేతర సంబంధం ఒక యువతి, ఒక వ్యక్తి ప్రాణాలను బలిగొంది. కూతురు వయసున్న యువతిని లోబరుచుకుని పెళ్లి చేసుకున్న ఓ వ్యక్తి, చివరకు ఇద్దరూ పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ ఘటన వరంగల్ జిల్లాలో తీవ్ర విషాదాన్ని నింపింది.

He was 42.. She was 22.. A love that ultimately took lifes!

వివరాల్లోకి వెళ్తే..

వరంగల్ ఎనుమాముల ఇందిరమ్మ కాలనీకి చెందిన 22 ఏళ్ల గాయత్రి ఇంటర్ మధ్యలోనే ఆపేసి ఇంట్లో ఉంటోంది. వీరి ఇంటి ఎదురుగా ఉండే 42 ఏళ్ల డీసీఎం డ్రైవర్ వేల్పుగొండ స్వామికి అప్పటికే పెళ్లై, ఇద్దరు కొడుకులు ఉన్నారు. అయినా గాయత్రిని మాయమాటలు చెప్పి లోబరుచుకుని ప్రేమాయణం సాగించాడు.

పెద్దల పంచాయతీ.. ఆ తర్వాత ఏమైందంటే..

ఈ విషయం తెలుసుకున్న గాయత్రి తల్లిదండ్రులు ఆరు నెలల క్రితం పెద్దల సమక్షంలో పంచాయతీ పెట్టారు. పెద్దలు మందలించడంతో స్వామి తన మకాంను హన్మకొండకు మార్చాడు. అయితే, గాయత్రితో రహస్యంగా సంబంధాన్ని కొనసాగించాడు.

గాయత్రికి పెళ్లి చేద్దామని తల్లిదండ్రులు భావిస్తుండగా, ఈ నెల 2వ తేదీన ఆమె ఇంట్లోంచి వెళ్లిపోయింది. 10 తులాల బంగారం, నగదు తీసుకుని స్వామితో కలిసి వెళ్లిపోయినట్లు తెలుస్తోంది. ఇంట్లోంచి వెళ్ళిపోయిన గాయత్రి, స్వామితో కలిసి విజయవాడ, గుంటూరులలో గడిపింది. ఆ తర్వాత వేములవాడలో ఇద్దరూ పెళ్లి చేసుకున్నారు.

ఆత్మహత్యాయత్నం, విషాద ముగింపు

అనంతరం అన్నారం షరీఫ్‌కు వచ్చిన ఇద్దరూ ఒక అద్దె గది తీసుకున్నారు. ఈ బంధం నిలబడదని భావించిన స్వామి, గాయత్రిని ఆత్మహత్యకు ప్రేరేపించినట్లు సమాచారం. దీంతో ఇద్దరూ పురుగుల మందు తాగారు.

ఘటనా స్థలంలోనే స్వామి మృతి చెందగా, కొన ఊపిరితో ఉన్న గాయత్రిని రూమ్ యజమాని వెంటనే వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. రూమ్ యజమాని సమాచారం ఇవ్వడంతో గాయత్రి తల్లిదండ్రులు ఆసుపత్రికి చేరుకున్నారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న గాయత్రి తన తండ్రితో, “నాన్న నన్ను బ్రతికించు, నాకు చచ్చిపోవాలని లేదు” అంటూ ప్రాణాలు విడిచింది.

ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

telugudesk

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago