శుభకార్యానికి లేదా స్నేహితులను కలవడానికి బయటకు వెళ్లాల్సి వచ్చిందంటే చాలామంది సువాసనలు వెదజల్లే పెర్ఫ్యూమ్స్, సెంట్‌ని చాలా మంది వాడతారు. అయితే వీటిని ఎక్కువగానే ఉపయోగిస్తారు. కాలేజీ స్టూడెంట్స్ దగ్గర నుంచి ఉద్యోగస్తుల వరకు సువాసన కోసం వీటిని వాడుతుంటారు. కానీ వీటి వల్ల ఆరోగ్యానికి హాని జరుగుతుందని ఆరోగ్య నిపుణలు హెచ్చరిస్తున్నారు.
కొన్ని రసాయన పదర్ధాల వల్ల తయారు చేసిన ఈ సెంట్ ఎలర్జీలను కలిగిస్తుందని చెబుతున్నారు. తమ సెంట్లో వివిధ రకల ఫ్లేవర్స్ ఉంటాయి. వివిధ రకాల పూల పేర్లు చెబుతుంటారు.. కానీ అందులో కలిపే రసాయన పదర్ధాల గురించి మాత్రం వెల్లడించరని వైద్య నిపుణులు తెలుపుతున్నారు. ఇలా వీటిని వాడే వారిలో రెండు శాతం మందికి అనారోగ్య సమస్యలతో బాధపుడుతున్నారన్నారు.
ఈ సమస్యల్లో ఎక్కువగా చర్మానికి సంబంధించినవిగా పేర్కొన్నారు. ఎలర్జీ, దద్దులు రావడం వంటివి వస్తున్నాయి. గాఢత ఎక్కువ ఉన్న పర్‌ఫ్యూమ్‌లు ఎక్కువగా వాడితే తలనొప్పి, వికారం, శ్వాస సంబంధిత సమస్యలు కూడా ఎదురయ్యే అవకాశం ఉంటుంది. ఇవి వ్యక్తిగతంగా వాడకపోయినా హోటల్స్, బ్యాంక్స్, ఎయిర్ లైన్స్ తదితర ప్రాంతాల్లో ఎక్కువగా వాడుతుంటారు. వీటిని పీల్చడం వల్లనూ శ్వాస సంబంధిత సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది.
కొంతమందికి వీటి వల్ల గాయాలు కూడా అవుతున్నాయని శాస్త్రవేత్తలు గుర్తించారు. అంతేకాకుండా వీటిని అధికంగా తీసుకోవడం వల్ల డిప్రెషన్ సమస్య కూడా పెరుగుతుందట. ఆ సమస్య రోజురోజుకూ ఎక్కువ అయి తీవ్ర ప్రమాదానికి గురయ్యే అవకాశం ఉందని పరిశోధకులు చెబుతున్నారు. కావునా సెంట్లకు, పెర్ఫ్యూమ్స్‌కు దూరంగా ఉండటమే మంచిదని వైద్యుల సలహా.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…