Featured

ఉప్పు ఎక్కువగా తింటున్నారా… అయితే ఈ సమస్యలు రావడం ఖాయం?

మనం ప్రతిరోజు చేసే వంటలకు రుచి రావాలంటే తప్పనిసరిగా ఉప్పు ఎంతో అవసరం. ఉప్పు వంటలకు రుచిని అందించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. అయితే ఉప్పును అధికంగా తీసుకోవడం వల్ల మన ప్రాణాలకు ఎంతో ముప్పని నిపుణులు తెలియజేస్తున్నారు. చాలా మంది ఎక్కువగా ఉప్పును తినడానికి ఇష్టపడుతుంటారు. ఈ క్రమంలోనే ఎన్నో సమస్యల బారిన పడతారని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఉప్పును అధికంగా తీసుకోవడం వల్ల ఎలాంటి సమస్యలు వస్తాయి ఉప్పును రోజుకు ఎంత పరిమాణంలో తీసుకోవాలి ఇక్కడ తెలుసుకుందాం..

Crystals of shallow salt in a scoop, spoon on a dark gray table. Background for advertising salt. Table salty. Salted food

సాధారణంగా ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరు ఎక్కువగా ప్రాసెస్ ఆహార పదార్థాలను తినడానికి ఇష్టపడుతున్నారు.ఈ క్రమంలోనే ఈ ఆహారపదార్థాలలో అధికభాగం ఉప్పు శాతం ఉండటం వల్ల తీవ్ర అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారు. తాజాగా ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదిక ప్రకారం ఉప్పును అధికంగా తీసుకునే వారిలో ఎక్కువగా హృదయసంబంధ వ్యాధులు, హార్ట్ స్ట్రోక్ వస్తున్నాయ్ అని వెల్లడించింది.

పలు అధ్యయనాల ప్రకారం భారతదేశంలో ప్రజలు రోజుకు సగటున 11 గ్రాముల చొప్పున ఉప్పు తీసుకుంటున్నట్లు పలు సర్వేలు వెల్లడించాయి.అయితే ఈ విధంగా 11 గ్రాములు ఉప్పు తీసుకోవడం వల్ల రాబోయే రోజులలో ఎన్నో ఆరోగ్య సమస్యల బారిన పడతారని నిపుణులు తెలుపుతున్నారు.ప్రతి మనిషి రోజుకు సగటున కేవలం ఐదు గ్రాములు తీసుకున్నప్పుడే ఎంతో ఆరోగ్యంగా ఉండగలము.

ఉప్పులో అధిక మొత్తంలో సోడియం ఉంటుంది. సోడియం మన శరీరంలో కరగడానికి అధిక మొత్తంలో నీరు అవసరమవుతుంది. అందుకోసం మన కణాల నుంచి నీటిని గ్రహించడం వల్ల తొందరగా డీహైడ్రేషన్ బారిన పడే అవకాశాలు ఉన్నాయి. అధిక సోడియం కారణంగా ధమనులలో అధిక ఒత్తిడి పెరిగి రక్తపోటుకు కారణం అవడమే కాకుండా గుండె సంబంధిత వ్యాధులు, మూత్రపిండాల వ్యాధులు వంటివి వ్యాపిస్తాయి. ఉప్పును అధికంగా తీసుకోవడం వల్ల కొందరిలో అధిక దాహం పెరుగుతుంది. ఈ క్రమంలోనే అవసరానికి మించి నీటిని తీసుకోవడం వల్ల మూత్ర సమస్యలు కూడా తలెత్తుతాయని నిపుణులు చెబుతున్నారు. అందుకే కేవలం రోజుకు ఐదు గ్రాముల చొప్పున ఉప్పు తీసుకోవడం వల్ల ఎలాంటి సమస్యలు ఉండవు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

కుదుళ్లు బలంగా… జుట్టు ఘనంగా! ఇంటి చిట్కాలతోనే పరిష్కారం!

ఇటీవల కాలంలో జుట్టు రాలిపోవడం చాలా మందికి పెద్ద సమస్యగా మారింది. వాతావరణ మార్పులు, ఒత్తిడి, పోషకాహారం లోపం వంటి…

5 hours ago

విజయవాడలో అపరాజిత దేవి మహిమ… దర్శిస్తే విజయం ఖాయం అంటున్న భక్తులు!

ఆంధ్రప్రదేశ్‌లోని ఆధ్యాత్మిక కేంద్రాలలో ఒకటైన అపరాజితా దేవి ఆలయం ఇటీవల భక్తుల దృష్టిని ఆకర్షిస్తోంది. విజయవాడలో ఉన్న ఈ ఆలయం…

6 hours ago

ధనిక వ్యాపారి నుంచి భక్తి యోగి… పురందరదాసు జీవితం స్ఫూర్తిదాయకం!

భక్తి సంగీతానికి పునాది వేసిన మహానుభావులలో పురందరదాసు పేరు ప్రత్యేకంగా నిలుస్తుంది. కర్ణాటక సంగీతానికి “పితామహుడు”గా గుర్తింపు పొందిన ఆయన,…

6 hours ago

రోజూ ఒక గ్లాస్ తాగండి… జీర్ణక్రియ నుంచి గుండె వరకూ ఫుల్ ప్రొటెక్షన్!

మన వంటింట్లో సులభంగా దొరికే ధనియాలు కేవలం వంట రుచిని పెంచడానికే కాదు, ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో కూడా కీలక పాత్ర…

6 hours ago

కుటుంబ సుఖశాంతుల కోసం సీతా నవమి పూజ ఎందుకు ముఖ్యమో తెలుసా?

హిందూ సంప్రదాయాల్లో ప్రత్యేక స్థానం కలిగిన సీతా నవమి పండుగను దేశవ్యాప్తంగా భక్తులు భక్తిశ్రద్ధలతో జరుపుకుంటారు. ఈ రోజు సీతాదేవి…

6 hours ago

సమ్మర్‌లో కూల్‌గా & ఎనర్జీగా ఉండేందుకు ఈ ఫుడ్స్ బెస్ట్.. మీ డైట్‌లో ఇవి ఉండాలి!

వేసవి కాలంలో పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో శరీరం త్వరగా అలసటకు గురవుతుంది. ఈ సమయంలో కేవలం చల్లని పానీయాలు తాగడం సరిపోదు.…

6 hours ago