health tips for women to reduce bloating problem in periods time
Health Tips : ప్రతి మహిళ నెలలో మూడు రోజులు నుంచి ఐదు రోజుల పాటు పీరియడ్స్ కారణంగా బాధపడుతూ ఉంటారు. చాలా మంది స్త్రీలు పీరియడ్స్ అంటే ఎంత గానో ఇబ్బందికి గురవుతారు. సరైన ఆహారాన్ని తీసుకోలేరు. కడుపు నొప్పి, నడుము నొప్పి, కాళ్ళు నొప్పి ఇలా ఒక్కొక్కరిలో ఒక్కో సమస్య ఎక్కువగా వస్తూ ఉంటుంది. అలానే మూడ్ స్వింగ్స్ లాంటివి కూడా వారిని బాధిస్తూ ఉంటాయి.
చాలా మంది స్త్రీలు మెనుస్ట్రేషన్ కంటే ముందే బ్లోటింగ్‌తో ఎక్కువగా బాధ పడుతూ ఉంటారు. ఈ సమస్య కొందరిలో మెనుస్ట్రేషన్ సైకిల్‌కు వారం ముందు గానే ప్రారంభమవుతుంది. కొన్ని సార్లు అసౌకర్యంగా ఉండడం మరియు నొప్పి కూడా ఉంటుంది. చాలా మంది స్త్రీలు మెనుస్ట్రేషన్ సైకిల్ కంటే ముందే బ్లోటింగ్‌తో బాధ పడుతూ ఉంటారు.
ఈ సమస్యలను మంచి ఆహారం పద్ధతి ద్వారా దూరం చేసుకోవచ్చని న్యూట్రిషనిస్ట్ కొన్ని చిట్కాలను తెలియజేశారు. అవేంటో ప్రత్యేకంగా మీకోసం… వ్యాయామాలు రోజు చేయడం ద్వారా మెన్సెస్ ప్రాబ్లమ్స్ కు చెక్ పెట్టవచ్చట. అలానే మనం తీసుకునే ఆహారంతో నొప్పులను దూరం చేసుకోవచ్చు. వ్యాయామం చేయడం వల్ల శరీరంలో వాటర్ రిటెన్షన్ తగ్గుతుంది, దాంతో బ్లోటింగ్ సమస్య మాయమవుతుంది.
సహజంగా యూరినేషన్ ప్రక్రియకు ఉపయోగపడే ఆహార పదార్థాలను తీసుకోండి. దాంతో యూరిన్ ఉత్పత్తి పెరుగుతుంది, ఇలా చేస్తే వాటర్ రిటెన్షన్ తగ్గుతుంది. కాబట్టి వాటికి అవసరమయ్యే ఆస్పరాగస్, పైనాపిల్, పీచ్, కీర దోస, అల్లం మరియు వెల్లుల్లి మీ రోజు వారీ ఆహారంలో భాగంగా తీసుకోండి. వాటితో పాటు మంచి నీటిని ఎక్కువగా తాగండి. దాంతో కూడా యూరిన్ ఫ్రీగా అవుతుంది. వీటిని రోజు పాటించడం వలన పిరియడ్స్ సమస్యలు కలిగే నొప్పులను దూరం చేసుకోవచ్చు.
ఈ దేశంలో అన్ని భాషల్లోనూ, అన్ని రాష్ట్రాల్లోనూ ఎన్నో పీఠాలు, మఠాలు, దేవస్థానాలు, ధార్మిక మండళ్ళూ, ట్రస్ట్ లు, ధార్మిక…
అద్భుత మంత్ర శక్తులతో, మంత్ర రహస్యాలతో, మంత్ర విశేషాలతో మరీ ముఖ్యంగా మహా బలాలకే మహా బలాన్నిచ్చే పరమాద్భుత నృసింహ…
భారత రూపాయి చరిత్రలో ఎన్నడూ లేని స్థాయిలో పతనమవుతోంది. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ రోజురోజుకు దిగజారుతూ ఆల్‌టైం…
చలికాలం వచ్చిందంటే చాలు.. చాలా మందికి ఒక విచిత్రమైన అనుభవం ఎదురవుతుంటుంది. కారు డోర్ తీస్తున్నా, కుర్చీలో కూర్చుంటున్నా, కనీసం…
నేటి ఉరుకుల పరుగుల జీవితంలో మానసిక ప్రశాంతతకు, శారీరక దృఢత్వానికి చాలామంది యోగాను ఆశ్రయిస్తున్నారు. అయితే, యోగా చేసేవారిని తరచుగా…
చేపలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయనడంలో సందేహం లేదు. అయితే, చేపలను ఏ ఆహారాలతో కలిపి తింటున్నాం అన్నదే అసలు…