ఆయుర్వేద పద్ధతులతో ఇమ్యూనిటీని పెంచుకోండి.. ఇంట్లోనే ఇలా తయారు చేసుకోవచ్చు..

శరీరంలో రోగనిరోధక శక్తి అనేది అత్యంత అవసరం. లేదంటే ఏ చిన్న జబ్బు చేసినా దాని నుంచి కోలుకోవడం అనేది చాలా కష్టం. కరోనా సమయంలో కూడా చాలా మంది ఈ ఇమ్యూనిటీ పవర్ పెంచుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. కరోనా నివారణకు మందు లేదు కాబట్టి.. రోగనిరోధక శక్తి పెంచుకునేందుకు డ్రైప్రూట్స్ లాంటి వాటి కోసం ప్రయత్నిస్తున్నారు.

ఇలాంటివే కాకుండా రోగ నిరోధక శక్తి పెంచుకోవడానికి ఆయుర్వేద పద్ధతులను కూడా పాటించవచ్చు. వాటి ద్వారా కూడా ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది. అందుకోసం కొన్ని రకాల మూలికలు, మసాలా దినుసులు తీసుకోవచ్చు. అవేంటంటే..వంటింట్లో వాడే పసుపు గురించి అందరికీ తెలిసిందే. దీనిలో యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు ఉంటాయి. దీనిలో కర్కుమిన్ అనే గుణం ఉన్నందున మెదడుకు కూడా మంచిది.

అరటీస్పూన్ పసుపును పాలల్లో వేసుకొని తాగితే రోగనిరోధక శక్తి పెరుగుతుంది. అంతే కాకుండా.. వివిధ మసాలా దినుసులు అనగా తులసి, దాల్చినచెక్క, నల్ల మిరియాలతో తయారు చేసిన మూలికా టీ తాగవచ్చు. ఇది ఆరోగ్యానికి చాలా మంచిది. రోగనిరోధక శక్తిని పెంచుతుంది. ముక్కురంధ్రాలలో నెయ్యి లేదా నువ్వుల నూనెను వేయడం వల్ల ఇన్ ఫెక్షన్ ను నివారించవచ్చు. కొన్ని చుక్కల నెయ్యి, నువ్వుల నూనె లేదా కొబ్బరి నూనెను మీ ముక్కు రంధ్రాలలో వేయడం వల్ల ఇన్ఫెక్షన్ నివారించవచ్చు.

స్నానం చేయడానికి ఒక గంట ముందు ఖాళీ కడుపుతో ఇలా చేస్తే.. నాసికా భాగాలను క్లియర్ చేసి, ఇన్ఫెక్షన్‌ను తరిమికొడుతుంది. రోగనిరోధక శక్తిని పెంచడానికి ఇది గొప్ప మార్గమని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు. బ్యాక్టీరియాను తొలగించడానికి, నోటి పరిశుభ్రతను కాపాడటానికి ఆయిల్ పుల్లింగ్ అనేది ఒక స్వదేశీ పద్ధతి. దీని ద్వారా మీ నోటి, నాసికా రోగనిరోధక శక్తి మెరుగుపడుతుంది.చ్యవన్‌ప్రాష్ అనేక ప్రయోజనాలను కలిగి ఉంటుంది. ఇది వైరస్‌తో పోరాడడంలో సహాయపడుతుంది. ఇది కూడా రోగనిరోధక శక్తిని పెంచుతుంది. బెల్లంతో ఆమ్లా, ఇతర మూలికలను కలపడం ద్వారా ఇంట్లో తయారుచేసుకోవచ్చు.